సమకాలీన వ్యవసాయ పరికరాల వినియోగం పంటల సాగు ప్రక్రియలో క్రమక్రమంగా రూపాంతరం చెందుతోంది. పెరుగుతున్న కూలీల కొరత కారణంగా రైతులు ఆధునిక యంత్రాలను కొనుగోలు చేయడం మరియు వినియోగించుకోవడంపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. యంత్రాలు వ్యవసాయంలో అంతర్భాగంగా మారాయి, దున్నడం, విత్తడం, కలుపు తీయడం మరియు కోయడం వంటి పనులను సులభతరం చేస్తున్నాయి.
ఈ ఒరవడిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాయితీలు కల్పిస్తూ ఆధునిక యంత్రాల సాధనకు ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. నర్సంపేట నియోజకవర్గంలో వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, పనిముట్లు 50 శాతం సబ్సిడీపై అందించేందుకు నిధులు కేటాయించారు. ఈ సబ్సిడీ వస్తువులను శుక్రవారం మరియు శనివారాల్లో ప్రదర్శించారు మరియు వాటి కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన అన్నదాతలకు పంపిణీ చేశారు. ఇప్పుడు, ఈ యంత్రాలలో కొన్ని ఎలా పనిచేస్తాయి అనే వివరాలను పరిశీలిద్దాం.
హార్వెస్టర్
వరి పండించే రైతులకు ఒకేసారి పంట కోతల సమయంలో కూలీల కొరత ఏర్పడుతుంది. వరి కోసి పంట నూర్పేందుకు చాలా మంది కూలీలు అవసరమవుతారు. ఈ యంత్రంతో వేగంగా వరి కోయవచ్చు. ఇందులో మూడు రకాలు ఉన్నాయి. వరి నూర్పిడి యంత్రం రూ. 25 లక్షల వరకు ధర ఉంది. ఇందులో వేగంగా వరి కోసే యంత్రం కూడా ఉంది. 45 నిమిషాల్లో ఎకరం వరిని నూర్పిడి చేయవచ్చు.
ఇది కూడా చదవండి..
2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు.. ప్రణాళికలను సిద్ధం చేసిన ప్రభుత్వం
భూం స్ప్రేయర్
ఒకేసారి పది నుంచి 15 సాల్లకు మందులు పిచికారీ చేయవచ్చు. పెద్ద పెద్ద చేలల్లో రోజుల తరబడి మందులు పిచికారీ చేసే రైతులు ఒకేసారి మందు పోసి స్ప్రే చేసే అవకాశం ఈ యంత్రంతో ఉంది. ఇందులో కంపెనీ సామర్థ్యాలను బట్టి ధరలు ఉన్నాయి.
తైవాన్ స్ప్రే
మామూలు యంత్రం కన్నా, తైవాన్ స్ప్రేతో చేనులో ప్రతి మొక్కకూ మందులు స్ప్రే చేయడానికి వీలవుతుంది. వీటిని 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. రకాన్ని బట్టి ధరలను కంపెనీలు నిర్ణయించాయి. మొక్క అన్ని భాగాలు మందుతో తడిసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
గడ్డి కట్టలు కట్టే యంత్రం, వరి, మక్కజొన్న కోసే యంత్రం, పవర్ టిల్లర్, వరి నాటే యంత్రం, పవర్ వీడర్ మరియు విత్తనాలు, ఎరువులు ఒకేసారి వేసే యంత్రం ఈ విధంగా చాలా యంత్రాలపై ప్రభుత్వం రైతులకు సబ్సిడీని అందిస్తుంది.
ఇది కూడా చదవండి..
Share your comments