భారతీయ ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధ మొక్కను ఉపయోగించి ఎన్నో రకాల మొండి వ్యాధులకు అద్భుత పరిష్కారం చూపబడింది.ఎన్నో ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు సమృద్ధిగా ఉన్న అశ్వగంధను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా అంటారు.అశ్వగంధ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు,యాంటీ వైరల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు సకల వ్యాధి నివారణ గా పనిచేసి మనలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాలుగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అశ్వగంధ చక్కటి పరిష్కారం చూపుతుందని ఇప్పటికే కొన్ని సర్వేలు వెల్లడించాయి.తాజాగా ఈ అంశంపై అధ్యయనం చేయడానికి భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసన్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా యూకేలోని లండన్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్ నగరాల్లో రెండు వేల మంది కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ జరపనున్నారు.
మూడు నెలల పాటు2వేల మందికి క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించనున్నారు. అందులో ఒక గ్రూపులోని వారికి అశ్వగంధ ఔషధాన్నీ అందిస్తారు. మరో కొంతమందికి అశ్వగంధ తరహాలోనే ఉండే ప్రభావం లేని మందును అందిస్తారు.ఈ సమయంలో అశ్వగంధ ఔషదం తీసుకున్నవారి యాక్టివిటీస్, మానసిక, శారీరక స్థితి, సప్లిమెంట్ ఉపయోగం, ప్రతికూలతలు వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ పరిశోధనలు విజయవంతమైతే అశ్వగంధ ఔషధానికి ప్రపంచ ఖ్యాతి దక్కుతుంది. మొత్తం క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తవడానికి దాదాపు 16 నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు
Share your comments