దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుండి బియ్యం వరకు అన్నిటి ధరలు భారీగా పెరికిపోయాయి. ప్రజలు ఈ నిత్యావసర సరుకులను కొనుగోలు చేయాలంటేనే వంద సార్లు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ధరలు అంతలా పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో టమోటా, మిర్చి, అల్లం మరియు బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. టమోటాలు ఐతే ఎన్నడూ లేని విధంగా ఆల్ టైం రికార్డ్స్ సృష్టించింది.
మార్కెట్‌లో తాజా కంది పప్పు లభ్యత ఆందోళన పెరుగుతోంది. కిలో పప్పు ధర దాదాపు రెండు వందల రూపాయలకు చేరుకోనుంది. ప్రస్తుతం, కిలో కంది పప్పు ధర నూట యాభై నుండి నూట ఎనభై రూపాయల వరకు ఉంది, దాని నాణ్యత ఆధారంగా ధర మారుతుంది. సమీప భవిష్యత్తులో పప్పుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు, వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తగ్గుతున్న సాగు మరియు ఉత్పత్తి కారణంగా కందిపప్పు ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ కందిపప్పు ధర రూ.200 పైగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ధరలు ఈవిధంగా పెరిగిపోతే పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు కష్టతరంగా మారుతుంది.
కందిపప్పు ధరలు పెరిగినప్పుడు గతంలో రేషన్ షాపుల ద్వారా రాయితీతో కంది పప్పును ప్రజలకు అందించేవారు. కానీ ఇప్పుడు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి కంది పప్పును రేషన్ షాపుల ద్వారా రాయితీపై అందించాలని ప్రజలు కోరుతున్నారు. కందిపప్పు సాగు దేశవ్యాప్తంగా కగ్గిపోయింది. ఫలితంగా ఉత్పత్తి కూడా పడిపోయింది.
ఇది కూడా చదవండి..
గుడ్ న్యూస్.. విద్యా శాఖలో 3295 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.! పూర్తి వివరాలు తెలుసుకోండి
2018 సంవత్సరంలో, మొత్తం కందిపప్పు ఉత్పత్తి 43 లక్షల టన్నులకు ఉంది, అయితే, ఈ సంఖ్య 2023లో 34 లక్షల టన్నులకు తగ్గింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పప్పు దినుసుల దిగుమతిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధరల పెరుగుదలకు ఉదాహరణగా కంది పప్పు 2018 ఆగస్టులో కిలోకు రూ.65 ధర పలికింది, కానీ ఇప్పుడు ఆగస్ట్ 23, 2023 నాటికి కిలో రూ.170కి పెరిగింది. గత సంవత్సరం ఇదే తేదీన, కిలో ధర రూ.115గా ఉంది, ఇది ఒక సంవత్సరంలోపు రూ.55 గణనీయంగా పెరిగింది.
కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు, స్థిరీకరించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. పెరుగుతున్న ఉల్లి ధరలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఈ దశల్లో ఒకటి ఉల్లి ఎగుమతులపై విధించిన ఎగుమతి సుంకం పెరుగుదల. అదనంగా, పెరుగుతున్న బియ్యం ధరలను ఎదుర్కోవడానికి, బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. అంతేకాకుండా, త్వరలో చక్కెర ఎగుమతిపై కూడా ఎగుమతి సుంకం విధించబడుతుందని అంచనా.
ఇది కూడా చదవండి..
Share your comments