భారత దేశ స్వతంత్ర ఉద్యమం ఎంతో మంది మహావీరులకు పురుడు పోసింది. మనం ఈ రోజు పిలుస్తున్న స్వేచ్ఛ వాయువులకు, మన దేశ దాస్య సుంకలలు తెంచేందుకు కారణమైన ఒక మహావీరుని కధ ఈరోజు మనం తెలుసుకుందాం.
23-జులై, 1906, దేశం తెల్లవారి ఆక్రమణకు, అరాచకాలకు, గురవుతున్న సమయం అది, ఆ రోజు భారత దేశం గర్వించదగ్గ ఒక స్వత్రంత్ర సమరయోధుడు, జన్మించాడు అతనే 15 సంవత్సరాలకే, బ్రిటిష్ ఆఫీసర్లకు వెన్నులో వణుకు పుటించిన చంద్ర శేఖర్ ఆజాద్ . చంద్ర శేఖర్ తివారి ఇదే అతని అసలు పేరు. 1906, జులై 23 న, మధ్య ప్రదేశ్ లోని, నేటి అలిరాజపూర్ జిల్లా, బభ్రా గ్రామంలో, ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనం నుండే అభ్యుదయ భావాలు అలవరచుకుని, అతని పయన్నాని స్వతంత్ర ఉద్యమాల వైపు, మార్చుకున్నాడు. తన తల్లి జాగ్రణి దేవి గారి కోరిక మేరకు కాశి విద్య పీఠ్ లో, సంస్కృత పాండిత్యం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కానీ కాలం చంద్ర శేఖర్ ఆజాద్ జీవితాన్ని, అనేక సంఘటనలు ద్వారా అతను పుట్టిన నెలకు అంకితం చేసేలా మరల్చింది.
1921 మహామాత్మ గాంధీ, పిలుపునిచిన్న సహాయ నిరాకరణ ఉద్యమం(Non- Cooperation Movement)తో అతని స్వతంత్ర పోరాటం మొదలు అయ్యింది. జిలియన్ వల్లభాగ్ లో జరిగిన మారణ హోమానికి, వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమంలో, చంద్ర శేఖర్ బ్రిటిష్ సైనికులాలకి చిక్కి, 15 ఏళ్లకే జైలుపాలు అయ్యాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన కారణం చేత 15 కొరడా దెబ్బల శిక్షను కూడా అనుభవించాడు. 1922 లో సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోవడంతో ఎంతో నిరాశపడ్డాడు. ఈ సంఘటనలు చంద్ర శేఖర్ జీవితంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టాయి. ఆ సమయానికే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్(HRA) అనే విప్లవకార సమస్త ఎన్నో తిరుబాటు చెర్యలు చేస్తుంది.
HRA లో చేరడం:
మరొక్క యువ విప్లవకారుడు, మన్మత్ నాథ్ గుప్తా, సహాయంతో HRA వ్యవస్థాపకుడు అయిన రామ్ ప్రసాద్ బిస్మిల్ ను కలిసే అవకాశం వచ్చింది. తరువాత అదే సంస్థలో చేరిన చంద్ర శేఖర్, వారి సంస్థ నిర్వహణకు అవసరం అయ్యే విరాళాలను సేకరించడం ప్రారంభించాడు. మన దేశాన్ని దోచుకుంటున్న బ్రిటిష్ కార్యాలయాల నుండి సంపదను దోచుకుని ఆ డబ్బును వారి సమస్థ నిర్వహానికి ఉపయోగించేవారు. చరిత్రలో ఒక కీలక ఘట్టమైన 1925 కాకోరి ట్రైన్ దొంగతనం లో కీలక పాత్ర పోషించాడు. లాల లజపత్ రాయ్, హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం, బ్రిటిష్ ఆఫీసర్ జ్.పి. సౌండెర్స్ ను కాల్చి చంపాడు. 1929 లో మరొక్క సాహసోపేతమైన చర్యకు పూనుకున్నాడు, ఈ సారి ఏకంగా బ్రిటిష్ వైస్రాయ్, లార్డ్ ఇర్విన్ ప్రయాణిస్తున్న ట్రైన్ పేల్చడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఇలా అతి చిన్న వయసులోనే ఎంతో సాహసాన్ని, కనబరిచాడు.
ఆజాద్, భగత్ సింగ్ HSRA స్థాపన:
కాకోరి ట్రైన్ దొంగతం తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వం తమ పైన జరుగుతున్న దాడులను కండించేందుకు, రక్షణను పెంచి, విప్లవకారులను అణచివేయ్యడం ప్రారంభించింది. ఇదే సమయంలో HRA ముఖ్య సభ్యులు అయినా, ప్రసాద్, ఆశ్ఫక్కుళ్ళ ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్ మరియు రాజేంద్ర నాథ్ లహరి ;లను బంధించి వారిని బ్రిటిష్ ప్రబుత్వం ఉరితీసింది . కేశబ్ చక్రబోర్తి, మురారి శర్మ తో బ్రిటిష్ వారి నుండి తప్పించుకున్న చెంద్ర శేఖర్, చెదిరిపోయిన వారి సభ్యులు అందరిని ఏకం చేసి HRA ని పునః ప్రారంభించారూ . బ్రిటిష్ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు జరిపిన భగత్ సింగ్ తో కలసి అప్పటి వరకు ఉన్న తమ సంస్థ పేరును, హిందుస్థాన్ సోసిలైస్ రిపబ్లిక్ అసోసియేషన్ (HSRA ) గ సెప్టెంబర్ 9, 1928 న నామకరణం చేసాడు. ఝాన్సీ లోని అటవీ ప్రాంతాన్ని తన తాక్కళిక నివాసం గా మార్చుకుని, గన్ ఫైరింగ్, స్విమ్మింగ్, వంటి వాటిలో శిక్షణ పొందాడు. అంతే కాకుండా చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రజలకు స్వతంత్రం పై అవహగాహన కలిపించి వారికి తుపాకీ ని ఉపయోగించడం లో శిక్షణ అందచేసాడు. ఈ విధంగా అతని లక్ష్యమైన స్వేచ్ఛను తన పేరుతో మమేకం చేసి "చంద్ర శేఖర్ ఆజాద్" గా రూపుదిద్దుకున్నాడు.
చంద్ర శేఖర్ ఆజాద్ మరణం...
బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర, మరియు అతను ఎంతగానో నమ్మిన తన అనుచరుల వెన్నుపోటు కారణంగా, ఆల్ఫ్ర్డ్ పార్క్ లో అతను రహస్య మంతనాలు జరుపుతున్నాడు అని తెలుసుకున్న బ్రిటిష్ CID ఆఫీసర్ జ్. ఆర్. హెచ్ నోట్-బోవెరా తుపాకులతో తన సిబంధిని వెంటపెట్టుకుని , ఆజాద్ ఉన్న పార్క్ ను చుట్టుముట్టారు. చాల సేపు జరిగిన ఎదురుకాల్పుల్లో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్స్ మరియు ఆజాద్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో చంద్ర శేఖర్ ఆజాద్ తో ఉన్న సుఖఃదేవ్ రాజ్ ను తపించ్చి తాను ప్రారంభించిన సంస్థ కొనసాగేలా చెయ్యమన్నాడు. వరుసగా జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆజాద్, చివరి వరకు తన ఓటమిని అంగీకరించలేదు. అతని శరీరంలోని ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి, చివరిగా బ్రిటీష్ సైనికుల చేతుల్లో అతని ప్రాణాలను అర్పించడం ఇష్టం లేక తన గన్ లో ఉన్న ఆఖరి బులెట్ తో కాల్చుకొని వీరమరణంపాలు అయ్యాడు.
చిన్న వయసులోనే ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని, తాను పుట్టిన నేలకు ఎంతో సేవ చేసి చివరికి అదే మట్టికి తన ప్రాణాలను సైతం తునఃప్రాయంగా అర్పిచాడు. మనం పుట్టిన దేశం మనకు ఏమి చేసింది అని ప్రశ్నించే నేటి యువతకు, చంద్ర శేఖర్ ఆజాద్ జీవితం ఒక చకట్టి ఉదాహరణగా చూపించవచ్చు. మనం ఎంచుకున్న లక్ష్యాన్ని అధిరోహించడం కోసం ఎన్నో కష్టాలను మరియు కఠిన మార్గాలను దాటవలసి ఉంటుంది. ఆజాద్ చంద్రశేఖర్, అతను అనుకున్న దాన్ని సాధించడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూ , ముఖ్యంగా దేరాయాన్ని కోల్పోకుండా నెటి యువతకు ఆదర్శప్రాయం నిలిచాడు .
చివరిగా చంద్రశేఖర్ ఆజాద్ చెప్పిన మాటల్లో నాకు బాగా నచ్చిన మాట మీకోసం, "I believe in a religion that propagates Equality, Freedom and Brotherhood"(నేను స్వేచ్ఛ సమానత్వం మరియు సోదరభావం ప్రచారం చేసే మతాన్ని నమ్ముతాను )
Share your comments