పెరుగుతున్న ఎండలతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు, రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉక్కపోతను అధిగమించడానికి చేసే ప్రత్యామ్నాయాలతో, విద్యుత్ వినియోగం కూడా తార స్థాయికి చేరుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆగ్నేయం నుండి కింది స్థాయిలో వేడి గాలులు వస్తున్నాయి.
మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరాఠ్వాడ మీదుగా అంతర్గత కర్ణాటక, తమిళనాడు వరకు ఏర్పడి ఉన్న ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. దీని ప్రకారం నేడు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం.
ఈరోజు మినహాయించి రాష్ట్రంలో రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండచ్చు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వే అవకాశం. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్ వాతావరణ పరిస్థితి చూస్తే అక్కడక్కడా మేఘాలు పట్టి ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ లో గరిష్టంగా 36 డిగ్రీలు మరియు కనిష్టంగా 25 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ లో తేమ శాతం అనేది 68 శాతం నమోదయింది.
ఇది కూడా చదవండి..
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేసీఆర్ కీలక నిర్ణయం.. యాసంగి వడ్ల మద్దతు ధర ఇదే !
ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ అంతటా వేడి విపరీతంగా పెరిగింది. ఎక్కువగా కర్నూలులో 41.5 డిగ్రీలు నమోదయ్యింది. రాష్ట్రంలోని ప్రజలు వడదెబ్బ భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు. మరోవైపున అధికపీడన ప్రాంతం కొనసాగుతోంది కాబట్టి రాయలసీమ జిల్లాల్లో వేడి రానున్న రోజుల్లో పెరగనుంది.
ఏప్రిల్- జూన్ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు, దక్షిణ భారత దేశంలో ఎండలు లేదా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ కొద్ది రోజుల క్రితమే తెలిపింది. ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.
ఇది కూడా చదవండి..
Share your comments