ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్సార్ పంట బీమాతో పాటు అనేక పథకాలు అమలు చేస్తుంది. ఈ పథకాల ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాల డబ్బులను ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేస్తుంది. అలాంటి పథకాల్లో వైఎస్సార్ వాహనమిత్ర పథకం ఒకటి.
వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా ఆటో, క్యాబ్, మ్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తుంది. గత ఏడాది రూ.10 వేలు ఇవ్వగా.. ఈ ఏడాదికి సంబంధించి త్వరలో ఏపీ ప్రభుత్వం డబ్బులు అకౌంట్లో జమ చేయనుంది. కొత్తగా అప్లై చేసుకునేందుకు ఈ నెల 6వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దీంతో ఇంకా ఈ పథకానికి ఇప్పటివరకు అప్లై చేసుకోనివారు వెంటనే అప్లై చేసుకుంటే త్వరలో అకౌంట్లో రూ.10 వేలు నగదు జమ అవుతాయి.
గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని, కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి త్వరలో నగదు జమ చేస్తామని తెలిపింది. 2021-22 సంవత్సరంలో ఈ పథకం కింద ఇప్పటికే 2,48,468 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, అర్హులెవరైనా మిగిలిపోతే ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే త్వరలో డబ్బులు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ పథకానికి అర్హతలు
సొంతగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండాలి
డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
సరైన ఆర్ సీ పొంది ఉండాలి
ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి
ఒక కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే డబ్బులు జమ చేస్తారు
అప్లై చేసుకున్న వ్యక్తి మీద వాహనం కలిగి ఉండాలి.
సరైన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి
అప్లికేషన్ విధానం
వాలంటీర్ల దగ్గర అప్లికేషన్ తీసుకుని పూర్తి చేసి వాలంటీర్ కు అందజేయాలి. ఆధార్, ఇతర డాక్యుమెంట్లు అందజేయాలి. మీకు అర్హతలు ఉండే లబ్ధిదారుల జాబితాలో పేరు చేరుస్తారు.
Share your comments