కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఒడిదుడుకులు మరియు ఇబ్బందులు ఎదురైనప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతున్నదని కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈరోజు ఇక్కడ 2021-22 సంవత్సరానికి బొగ్గు మంత్రి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో శ్రీ జోషి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ జోషి భారతదేశ ఇంధన భద్రతను కల్పించే అంశంలో బొగ్గు రంగం కీలక పాత్ర పోషిస్తున్నదని అన్నారు. . బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు సిఐఎల్ మరియు దాని అనుబంధ సంస్థలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా మరియు కొత్త సాంకేతికత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పెట్టాలని శ్రీ జోషి కోరారు. ఈ కార్యక్రమానికి బొగ్గు కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జైన్, కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీ ప్రమోద్ అగర్వాల్ మరియు మంత్రిత్వ శాఖ మరియు కోల్ ఇండియా అనుబంధ సంస్థలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తూ బొగ్గు ఉత్పత్తిలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సంస్థలను గుర్తించి గౌరవించాలన్నలక్ష్యంతో గత ఏడాది నుంచి ఈ అవార్డులను అందజేయడం జరుగుతోంది. సంస్థలు ఒకదానికొకటి పోటీ పడి అభివృద్ధి సాధించేందుకు అవసరమైన అనుకూలమైన మరియు పోటీతత్వ స్ఫూర్తిని కల్పించడం కూడా లక్ష్యంగా అవార్డులు అందిస్తున్నారు.
గత సంవత్సరం భద్రతకు ఉత్పత్తి ఉత్పాదకత; స్థిరత్వం. పరిధి విస్తరణ తరగతుల్లో అవార్డులను అందజేయడం జరిగింది. ఈ ఏడాది వీటితో పాటు నాణ్యత మరియు ఈ ఆర్ పి అమలులో రెండు కొత్త అదనపు అవార్డులు అందజేయడం జరిగింది. ఉత్తమ పనితీరును కనబరిచిన ప్రాంతాల జనరల్ మేనేజర్‌లు కూడా ఈ సంవత్సరం నాలుగు ఉపవర్గాలలో గుర్తింపు పొంది అవార్డుకు ఎంపికయ్యారు.
అగ్రి జర్నలిస్టుగ మరలనుకుంటున్నారా ? కృషి జాగరణ్ తో చేతులూ కలపండి ..
ఐదు విభాగాల్లో లభించిన అవార్డుల్లో భద్రత, ఉత్పత్తి ఉత్పాదకత మరియు నాణ్యత విభాగాల్లో మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) మొదటి బహుమతి కైవసం చేసుకుంది. సస్టైనబిలిటీ విభాగంలో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యుసిఎల్) మొదటి బహుమతిని పొందగా, ఇఆర్‌పి అమలులో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సిఎల్) మొదటి బహుమతిని కైవసం చేసుకుంది.
ఈ సంవత్సరం కూడా ఉత్తమ పనితీరును కొనసాగిస్తూ కోల్ ఇండియా లిమిటెడ్ ఇప్పటివరకు (11 ఆగస్టు, 2022 వరకు) 224 మిలియన్ టన్నుల (ఎంటీ ) బొగ్గు ఉత్పత్తి చేసింది. బొగ్గు ఉత్పత్తిలో గతంలో లేనివిధంగా 24% వృద్ధిని సాధించింది . 10.4% వృద్ధితో 251 MTల మొత్తం ఆఫ్‌టేక్ కంపెనీ పనితీరులో మరో అంశం.
అలాగే, మహమ్మారి అనంతర ఆర్థిక వృద్ధిని దేశం పునరుజ్జీవింప చేస్తున్న తరుణంలో, కోల్ ఇండియా మూలధన వ్యయం ఆర్థిక సంవత్సరం '22 లో గతంలో ఎన్నడూ లేనివిధంగా 15,400 కోట్ల రూపాయల గరిష్ట స్థాయికు చేరుకుంది, వరుసగా రెండవ సంవత్సరం కూడా మించి ఉత్పత్తి జరిగింది.
Share your comments