News

కరోనా తరహాలో "మార్బర్గ్ " వైరస్ విజృభించే అవకాశం : డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!

Srikanth B
Srikanth B

గత రెండు సంవత్సరాలుగా ప్రపంచం మొత్తాన్ని వణికించిన కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టి దేశాలు ఆ వైరస్ కల్గించిన నష్టంనుంచి ఇప్పుడిపుడే కోలుకుంటున్న దేశాలకు మార్బర్గ్ అనే మరో వైరస్ ముప్పు పొంచి వున్నదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికను జారీ చేసింది .

రానున్న రోజులలో కొవిడ్-19కి మించి నష్టం చేకూర్చే ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని, మార్బర్గ్ అని పిలువబడే ఈ వైరస్ కొవిడ్-19 తో పోలిస్తే ప్రాణాంతకమని ప్రపంచ దేశాలకు హెచ్చరికలను జారీ చేసింది . ప్రస్తుతానికి మార్బర్గ్ వైరస్ వ్యాప్తి ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్నాయని ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం చేసింది . ఈ వ్యాధికి బ్ల్యూహెచ్‌వో WHO ‘డిసీజ్‌-ఎక్స్’ నామకరణం చేసింది దీన్ని తొలి దశలోనే కట్టడి చేయాలనీ లేదంటే కరోనా కంటే అధికముగా నష్టాన్ని కలిగిస్తుందని ,ప్రపంచాన్ని వణికించిన ఎబోలా కంటే ప్రమాదకరమని పేర్కొంది. ‘డిసీజ్‌-ఎక్స్’ సోకిన వారిలో 80 శాతం మంది ప్రాణాలు కోల్పోతారని చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారిలో ఇప్పటికే రోగ నిరోధక శక్తి తగ్గిందని, ఇప్పుడు కొత్తగా డిసీజ్-ఎక్స్ సోకితే పెను ముప్పు సంభవిస్తుందని పేర్కొంది.

హైదరాబాద్ రెండో దశ మెట్రో కు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన !

అంతేగాక, డిసీజ్-ఎక్స్‌కు మందులు , వ్యాక్సిన్లు లేవని , ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్తలు ఈ కొత్త వైరస్‌కు ఔషధాలను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. చైనాలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా సంక్షోభం నుంచి చాలా దేశాలు ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు ‘డిసీజ్‌-ఎక్స్’ విజృంభిస్తే పరిస్థితులు మరింత జటిలం అవుతాయని ప్రపంచ దేశాలకు మార్బర్గ్ కట్టడి చేయాలనీ హెచ్చరికలను జారీచేసింది .

హైదరాబాద్ రెండో దశ మెట్రో కు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన !

Share your comments

Subscribe Magazine

More on News

More