News

అధికంగా పెరిగిన నిమ్మ ధర .. రేటు ఎంతో తెలుసా?

KJ Staff
KJ Staff

మార్కెట్ లో నిమ్మ రేటు అమాంతంగా పెరిగింది, దీనితో నిమ్మ రైతుల పంట పండింది. మొన్నటి వరకు మార్కెట్లో నిమ్మకు సరైన ధరల్లేక దిగులుగా ఉన్న రైతులకు మార్కెట్లోని నిమ్మ ధర మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. మొన్నటి వరకు రూ. 10 నుండి రూ. 15 పలకగా నేడు మార్కెట్లో ఆ ధర రూ. 25 నుండి రూ. 30 వరకు పెరిగింది. ఈమధ్య మార్కెట్లో నిమ్మ యొక్క నాణ్యత పెరిగి, ఉత్పత్తి తగ్గడంతో నిమ్మకు బాగా డిమాండ్ పెరిగింది. వ్యాపారాలు రాబోయే కాలంలో నిమ్మ ధర మరింత పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పండు కాయకు కే.జి రూ. 15 మరియు పచ్చికాయకు కే.జి. రూ. 25 నుండి రూ. 30 వరకు ధర ఉంది.

ప్రకాశం జిల్లాలో ఎక్కువగా నిమ్మ సాగు కనిగిరి నియోజకవర్గంలోనే జరుగుతుంది. ఇంచుమించుగా 50 వేళా ఎకరాల వరకు నిమ్మ సాగు ప్రకాశం జిల్లాలో సాగుతుంది. 32 వేళా ఎకరాల్లో నిమ్మ సాగు ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే ఉన్నట్లు అంచన. సీఎస్ పురం, వెలిగండ్ల మండలాల్లో దాదాపుగా 12 వేల ఎకరాల వరకు నిమ్మ సాగు సాగుతుంయింది. ఎక్కువగా ఎర్రనేలలో పండే నిమ్మకు ఎక్కువ శాతం డిమాండ్ ఉందని వ్యాపారాలు చెబుతున్నారు.

వర్షాలు బాగా పడి, భూగర్భ జలాలు నిండడంతో రైతులు ఎక్కువగా నిమ్మ సాగు చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు సీసన్ లో నాలుగు నుండి ఐదు లారీల దిగుబడి రోజుకు రావాల్సివుండగా, మార్కెట్ లోకి రెండు నుండి మూడు లారీలు మాత్రమే ప్రస్తుతం వస్తున్నాయి. దీనితో నిమ్మకు డిమాండ్ పెరిగి, మార్కెట్లో సరుకు లేకపోవడంతో భారీగా ధర పెరిగింది. రానున్న కాలంలో ఈ ధర రూ. 50 కు చేరుకున్న ఆశ్చర్య పడకర్లేదని అన్నారు.

ఇది కూడా చదవండి..

దేశీయ మిర్చికి ఆల్ టైం రికార్డు ధర క్వింటాల్ కు 81 వేలు ..

కనిగిరి పట్టణంలో సీసన్ కు సుమారుగా 50 వేల టన్నుల నిమ్మకాయలను హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, ప్రదేశాలకు పంపుతారు. చెన్నై, బెంగుళూరు మార్కెట్లోకి కనిగిరి పట్టణం నుండి ఎక్కువగా ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం మాత్రం కేవలం 2 లారీల నిమ్మకాయలు మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం కాయ ఎగుమతికి డిమాండ్ పెరిగి సరుకు ఉత్పత్తి తగ్గి ధరలు అమాంతంగా పెరిగాయి. మర్చి నెలాఖరుకి నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..

దేశీయ మిర్చికి ఆల్ టైం రికార్డు ధర క్వింటాల్ కు 81 వేలు ..

Related Topics

lemon prices

Share your comments

Subscribe Magazine

More on News

More