అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనె ధరలు నిత్యం తగ్గుతూనే వున్నాయి కానీ భారతీయ మార్కెట్లో ధరలు గత కొంత కాలంగా ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి .
వంటనూనె ధరలు తగ్గనున్నాయి వార్తలు వస్తున్న క్రమంలో తాజాగా మదర్ డెయిరీ తన వంటనూనె బ్రాండ్ 'ధార' ధరలను వరుసగా రెండో నెలలో తగ్గించింది. ఈ తగ్గింపు లీటరుకు రూ.10. అంటే నెల రోజుల్లోనే లీటర్‌కు రూ.20 నుంచి 25 వరకు ధర తగ్గింది. దీని వల్ల సామాన్యులకు పెరుగుతున్న ధరల నుంచి కాస్త ఊరట లభించనుంది .
ఒక కిలో వంటనూనె కేవలం రూ.40 మాత్రమే.. ఎక్కడో తెలుసా?
వచ్చే వారం నుంచి కొత్త ధరలతో ప్యాకింగ్ అందుబాటులోకి వస్తుందని వంటనూనె బ్రాండ్ ‘ధార’ను విక్రయిస్తున్న మదర్ డెయిరీ తెలిపింది. ఈ నూనె ధరలను లీటరుకు రూ.10 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్ ప్రాంతంలో పాల ఉత్పత్తుల సరఫరాదారు అయిన మదర్ డైరీ కూడా ధారా బ్రాండ్‌లో వంట నూనెలను విక్రయిస్తుంది. అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పడుతుండడంతో ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
అదే విధంగా ధార కాచి ఘనీ మస్టర్డ్ ఆయిల్ ఎంఆర్‌పి లీటర్‌కు రూ.160, ధార మస్టర్డ్ ఆయిల్ ఎంఆర్‌పి రూ.158గా ఉంది. దీంతో ఇకపై ధార శుద్ధి చేసిన కుసుమ నూనె లీటరు రూ.150కి విక్రయించనుంది.
Share your comments