మార్కెట్లో ఉల్లి ధర ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఉల్లి రైతులు నష్టానికి గురవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లిపాయల ధర రోజు రోజుకూ పడిపోతోంది. జనవరి మొదటి వారంలో క్వింటా ఉల్లిపాయల ధర రూ.2వేల నుంచి రూ.2100 దాకా పలికింది. మార్కెట్ లో క్వింటా ఉల్లికి రూ.వెయ్యి కూడా పలకని పరిస్థితి చోటు చేసుకుంది. నిన్న అనగా బుధవారం మార్కెట్ లోకి పెద్ద ఎత్తున ఉల్లి వచ్చింది.
దేవరకద్ర మార్కెట్ లోకి నిన్న సుమారుగా ఐదు వేల ఉల్లి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఈ మార్కెట్ లో ఉల్లికి కనిష్టంగా రూ. 610 మారాయి గరిష్టంగా రూ.950 వరకు పలికింది. మార్కెట్ లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేలం మధ్యాహ్నం వరకు జరిగింది. కానీ ఉల్లి ధర వెయ్యి రూపాయలు కూడా దాటలేదని రైతులు దిగులు చెందుతున్నారు.
మార్కెట్ లో ఉల్లిని పెట్టడానికి చోటులేకపోవడంతో రైతులు మార్కెట్ ఆవరణలోనే కుప్పలుగా పెట్టి విక్రయిస్తున్నారు. ఉల్లి ధరలు తక్కువగా ఉండడంతో వినియోగదారులు ఉల్లిని బస్తాలుగా కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ కు వచ్చిన ఉల్లి కూడా నాణ్యతగా ఉండడంతో కొంత కాలం పాటు నిల్వ చేసుకోవచ్చనే ఆలోచనతో వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
రెండు లక్షలు పలికిన ఆవు ధర .. పూటకు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందో తెలుసా ?
మార్కెట్ ధరల ప్రకారం 45 కేజీల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.500 నుంచి రూ.450, కనిష్టంగా రూ.400 నుంచి రూ.300 వస్తున్నాయి, దీనికి ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి ఉండి తక్కువ ధరలకే విక్రయిస్తుండడంతో నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. వినియోగదారులకు నేరుగా ఉల్లి బస్తాను రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయించారు.
ఈ ఏడాది ఉల్లి సాగు కాస్త తగ్గింది. దీంతో రబీలో వేసిన ఉల్లి పంట దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఏపీతోపాటు, మహారాష్ట్రలో ప్రస్తుతం ఉల్లి దిగుమతులు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ధర తగ్గడంతో నాణ్యమైన సరుకును కొందరు వ్యాపారులు నిల్వ చేస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..
Share your comments