The prices of cooking oil will increase with the central decision!
కేంద్ర నిర్ణయం తో పెరగనున్న వంట నూనె ధరలు !
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వంట నూనెలపై రూపాయలు తగ్గించాలని తీసుకున్న నిర్ణయంతో కాస్త ఊపిరి పీల్చుకున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ వాతను అందించింది . పామ్ ఆయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం వరకు పెంచనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ పెరుగుదలతో పరోక్షంగానే వినియోగదారుడిపై ప్రభావం పడే అవకాశం ఉంది .
టన్నుకు 858 డాలర్లుగా ఉన్న సుంకం పెరిగి టన్నుకు 952 డాలర్లకు చేరింది. ఇతర పామ్ ఆయిల్ టారిఫ్ కూడా టన్నుకు 882 డాలర్ల నుంచి 957 డాలర్లకు పెరిగింది.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి దేశంగా కొనసాగుతోంది. అలాగే సిల్వర్ విషయంలోనూ అగ్ర స్థానంలో ఉంది. ఇక బంగారం వినియోగంలో మాత్రం రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో చైనా ఉంది. దిగుమతి దారులు ఈ దిగుమతి సుంకాల ఆధారంగానే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా క్రూడ్ సోయా ఆయిల్‌పై దిగుమతి సుంకం టన్నుకు 1345 డాలర్లకు ఎగసింది. ఇదివరకు ఇది టన్నుకు 1274 డాలర్ల వద్ద ఉండేది. ఇక బంగారంపై దిగుమతి సుంకాలు 531 డాలర్ల వద్దనే ఉన్నాయి. పది గ్రాములకు ఇది వర్తిస్తుంది. ఇంకా వెండిపై అయితే దిగుమతి సుంకం స్వల్పంగా పెరిగింది. ఒక డాలర్ పైకి కదిలింది. వెండిపై దిగుమతి సుంకం కేజీకి 630 డాలర్ల వద్ద ఉంది.
నేడు భారత దేశ డిజిటల్ రూపాయి విడుదల : RBI
అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పెరిగిపోవడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతి రెండు వారాలకు ఒకసారి బేస్ దిగుమతి సుంకాలను సవరిస్తూ ఉంటుంది. ఎడిబుల్ ఆయిల్స్, గోల్డ్, సిల్వర్ వంటి వాటిపై దిగుమతి సుంకాల మార్పు ఉంటుంది.
Share your comments