ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో ‘డోనీ పోలో’ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతోపాటు 600 మెగావాట్ల ‘కమెంగ్’ జలవిద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు.
ఈ విమానాశ్రయం నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రే శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రపంచ మహమ్మారి తీవ్రరూపం దాల్చి సవాళ్లు విసిరినా విమానాశ్రయ నిర్మాణం అత్యంత వేగంగా పూర్తయింది. ప్రారంభోత్సవం నేపథ్యంలో కార్యక్రమానికి హాజరైన ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ- అరుణాచల్ ప్రదేశ్‌ను తాను తరచూ సందర్శించడాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే ఇవాళ ఘనంగా నిర్వహించబడిన కార్యక్రమంతో రాష్ట్ర ప్రగతిపై అరుణాచల్ ప్రదేశ్ ప్రజల చిత్తశుద్ధిని ఆయన ప్రశంసించారు.
సైనైడ్ కంటే 6,000 రెట్లు విషపూరితం - ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన మొక్క!
అరుణాచల్ ప్రజానీకం ఉల్లాస ప్రియులైనా ఎంతో క్రమశిక్షణ కలిగినవారని కొనియాడారు. ఒక ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేశాక దాన్ని తానే జాతికి అంకితం చేసే సంప్రదాయా ప్రస్తావిస్తూ- దేశంలో మారిన పనిసంస్కృతికి ఇది నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. డోనీ పోలో విమానాశ్రయానికి శంకుస్థాపనను ఎన్నికల ఎత్తుగడగా ఆరోపించ యత్నించిన విమర్శకులకు ఇవాళ దీని ప్రారంభోత్సవమే దీటైన జవాబని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రగతిని రాజకీయ ప్రయోజనాల కోణంలో కాకుండా కొత్త ఆలోచనల టోపీ ధరించి చూడాలని రాజకీయ ప్రత్యర్థులకు ప్రధాని సూచించారు. రాష్ట్రంలో సమీప భవిష్యత్తులో ఎన్నికలేవీ లేకపోవడమే తన వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. “ఉషోదయ రాష్ట్రం నుంచి ప్రారంభించిన ఈ రోజును దేశంలో సంధ్యాసమయ ప్రాంతమైన డామన్‌లో ముగిస్తాను… మధ్యలో కాశీని కూడా సందర్శిస్తాను” అని ఆయన వ్యాఖ్యానించారు.
Share your comments