News

అంతర్జాతీయ మార్కెట్ లో గోధుమల కొరత ఎగుమతి చేసే దిశగా భారత్

S Vinay
S Vinay

ప్రస్తుతం రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ యుద్ధ ప్రభావం కేవలం రెండు దేశాల పైనే కాకుండా అంతర్జాతీయంగా వివిధ అంశాల పై చాల దేశాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

అంతర్జాతీయ మార్కెట్ లో గోధుమ ఎగుమతుల్లో రష్యా మరియు ఉక్రెయిన్ వాటా దాదాపు 23 నుండి 25% వరకు ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కారణంగా దేశీయ అవసరాల దృష్ట్యా ఈ రెండు దేశాలు ఎగుమతులని ఆపేసాయి అయితే గోధుమలకై ఈ రెండు దేశాల పై ఆధారపడ్డ అన్ని దేశాలు ఇప్పుడు అగమ్య గోచ పరిస్థితుల్లో పడ్డాయి. గోధుమల దిగుమతికై ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాయి.

భారతదేశం గోధుమ ఉత్పత్తి లో రెండవ స్థానంలో ఉంది (మొదటి స్థానం లో చైనా ఉంది). అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో గోధుమల అధిక ధరను ప్రయోజనం చేకూర్చుకునేలా భారత ప్రభుత్వం పెరిగిన ఎగుమతులను అనుమతించాలనే ఆలోచన లో ఉంది. రెండవ అత్యధిక గోధుమ యూథపతి దేశంగా ఉన్న భారత దేశం ఇప్పటి వరకు మొత్తం ఉత్పత్తిలో ఇందులో 2% మాత్రమే ఎగుమతి చేసింది. దాదాపు 80% దేశీయ వినియోగానికి ఉపయోగించబడగా మిగిలిన ధాన్యం నిల్వ చేయబడ్డాయి.

గోధుమలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో ఈజిప్టు, ఇండోనేషియా మరియు ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.ఇప్పుడు యుద్ధం కారణంగా వీటికి సరఫరా ఆగిపోయింది. అయితే ఈ దేశాలకి గోధుమలను ఎగుమతి చేయడంపై భారతదేశం ఇప్పుడు దృష్టి సారిస్తోందని APEDA(The Agricultural and Processed Food Products Export Development Authority ) చైర్మన్ డాక్టర్ మదయ్యన్ అంగముత్తు తెలిపారు. గోధుమ ఎగుమతి ప్రోత్సాహానికి ఊతమివ్వడంతోపాటు ఉత్పత్తి మరియు ఎగుమతిలో ఎదురవుతున్న సవాళ్లు మరియు అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని, APEDA ఒక టాస్క్ గ్రూప్‌ను రూపొందించింది అని వెల్లడించారు.

అయితే మరి కొంత మంది ఆహార నిపుణులు ఎగుమతుల పరిమాణాన్ని నిర్ణయించే ముందు స్థానిక ధరలకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు దేశీయ వినియోగానికి తగిన సరఫరాలను నిర్ధారించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యనించారు.

మరిన్ని చదవండి.

Minimum Supporting Price: కనీస మద్దతు ధర కోసం కమిటీని ఏర్పాటు చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం : నరేంద్ర సింగ్ తోమర్!

జీడిపప్పు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే 2 వ స్థానం

Share your comments

Subscribe Magazine

More on News

More