News

అమెరికాను ముంచెత్తిన మంచు తూఫాను .. -45 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు !

Srikanth B
Srikanth B
Snow storm in  USA
Snow storm in USA

అమెరికాలో మంచు తుఫాను కారణముగా జన జీవనం స్తంభించింది .. అమెరికాలోని కొన్ని నగరాలలో దాదాపు -45డిగ్రీలకు ఉషోగ్రహాలు పడిపోయాయి . మంచు తుఫాను కారణముగా ఇప్పటికి అమెరికాలో 48 మంది మరణించినట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి.

 

మంచు తూఫాను కారణముగా అమెరికాలోని లక్షలాది మందికి బయటకు వెళ్లడం కూడా కష్ట తరముగా మారింది కరెంటు లేకపోవడం, ఆరోగ్య సంరక్షణ లేకపోవడం మరియు ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువగా పడిపోవడంతో అమెరికా మొత్తం స్తంభించిపోయింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, 14 లక్షలకు పైగా గృహాలు విద్యుత్తును కోల్పోయాయి. కాగా ఉష్ణోగ్రత -45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.

అమెరికాలో మంచు కురుస్తున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని చోట్ల మైనస్ 45 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. న్యూయార్క్‌లోని చాలా నగరాలు మంచు పోయాయి అదేవిధముగా వేడి నీళ్లు సైతం గడ్డ కట్టే స్థితికి ఉష్ణోగ్రతలు పడి పోయాయి .. అమెరికా లోని 13 రాష్ట్రాలలో పరిస్థితితులు మంచు తుఫాను ప్రభావం కారణంగా దారుణముగా మారాయి . జనాలు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి .

TSRTC: ప్రయాణికులకు సంక్రాంతి పండుగ రాయితీ .. టికెట్ పై 10% డిస్కౌంట్ !

అమెరికాలోని 'ఈ' ప్రదేశంలో మంచు తుఫాను ప్రభావం అధికముగా వుంది .
మిన్నియాపాలిస్
డెలావేర్
ఇల్లినాయిస్
ఇండియానా
కెంటుకీ
మేరీల్యాండ్
మిచిగాన్
కొత్త కోటు
ఉత్తర కరొలినా
ఓహియో
పెన్సిల్వేనియా
టేనస్సీ
వర్జీనియా
వెస్ట్ వర్జీనియా
వాషింగ్టన్ డిసి


యునైటెడ్ స్టేట్స్ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, దాదాపు 20 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ మంచు తుఫాను క్రిస్మస్ ఆనందాన్ని మార్చేసింది . ఇప్పటి వరకు దాదాపు 7 వేల 700 విమానాలు రద్దు అయ్యాయి. US చరిత్రలో అత్యంత ఘోరమైన మంచు తుఫానుగా పరిగణించబడే ఈ ప్రాంతంలో ప్రస్తుతం వేలాది మంది ప్రజలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 48 మందిని బలిగొన్న ఈ తుపాను ముందు అగ్రరాజ్యం అమెరికా నిస్సహాయంగా కనిపిస్తోంది.

TSRTC: ప్రయాణికులకు సంక్రాంతి పండుగ రాయితీ .. టికెట్ పై 10% డిస్కౌంట్ !

Related Topics

snow America winter season

Share your comments

Subscribe Magazine

More on News

More