News

ఆంధ్ర - తెలంగాణ రాష్ట్ర లలో వరద నష్టం పై నివేదిక సమర్పించిన కేంద్ర వ్యవసాయ మంత్రి

KJ Staff
KJ Staff
The Union Agriculture Minister presented a report on flood damage in the states of Andhra and Telangana, Source: union minister
The Union Agriculture Minister presented a report on flood damage in the states of Andhra and Telangana, Source: union minister

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరియు వరదల కారణంగా వ్యవసాయ పంటలకు ఏ మేరకు నష్టం వాటిల్లిందనే దానిపై వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధవారం హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై ప్రాథమిక నివేదికను సమర్పించారు.

"ఆంధ్ర మరియు తెలంగాణలోని వరదలు మరియు భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో సంభవించిన నష్టం యొక్క ప్రాథమిక నివేదికను అందజేసారు. త్వరలో, ఒక కేంద్ర బృందం ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేస్తుంది," అని షాను కలిసిన తర్వాత చౌహాన్ X సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో వరదలు వ్యవసాయ భూములను తీవ్రంగా ప్రభావితం చేశాయి, రెండు రాష్ట్రాలలో గణనీయమైన పంట నష్టంజరిగిందని. కేవలం ఆంధ్రాలోనే దాదాపు 1.8 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని కేంద్ర మంత్రి తన ఇటీవలి పర్యటనలో తెలిపారు.

కేంద్ర మంత్రి చౌహాన్ గత వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించారు. పునరుద్ధరణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

Share your comments

Subscribe Magazine

More on News

More