హైదరాబాద్: శనివారం జూబిలీ హిల్స్ లో జరిగిన దోపిడీ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి , ఇంట్లోకి చొరబడి , కత్తి తో బెదిరించి, 10 లక్షలు దోచుకుని పరారయ్యాడు.
పోలీసుల విచారణ ప్రకారం, నిందితుడు నిచ్చన ద్వారా మీద మీదకి ఎక్కి , ఇంట్లోని ఒక గదిలోకి చొరబడ్డాక, 8 నెలల గర్భిణీ నిద్రపోతూ ఉండడం చూశాడట. చప్పుడుకి ఆవిడ నిద్ర లేచి ఎవరినైనా పిలిచే లోపు, దొంగ కత్తితో బెదిరించి , 20 లక్షలు ఇవ్వాల్సిందని డిమాండ్ చేసాడట. పైన వచ్చే శబ్దాలకు కింద ఉన్న ఆ మహిళా తల్లి పైకొచ్చి చూడగా, తనని కూడా గదిలో బంధించి డబ్బు కోసం బలవంతపెట్టాడట. ముందు 2 లక్షల ఇచ్చిన ఇద్దరి మహిళలని, 20 లక్షలు ఇవ్వాలని బయపెట్టగా, మరో 8 లక్షలు అప్పగించారట. డబ్బు తీస్కున్నాక , వాళ్ళ చేతనే షాద్నగర్ కు క్యాబ్ బుక్ చూపించుకుని దొంగ జంప్ అయ్యాడు.
సంఘటన నుండి తేరుకున్నాక, బాధితులు పోలీస్ కంప్లైన్ట్ ఇచ్చారు. దోపిడీ జరుగుతున్న సమయం లో ఒక్క CCTV తప్ప మిగతావేవీ పనిచేయకపోవడం తో, నిచ్చెన నుండి వస్తున్న ఫుటేజి మాత్రమే దొరికిందట. క్యాబ్ డ్రైవర్ దొంగని షాద్నగర్ బస్సు స్టిఫ్ లో విడిచి పెట్టక కాష్ తో చెల్లించడం వళ్ళ , దొంగ గురించి ఎలాంటి సమాచారం ఇంకా తెలియలేదట. దొంగ వెళ్లిన వైపుగా పోలీసులు విచారణ జరిపిస్తున్నారట.
ఇది కూడా చదవండి
Share your comments