తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్ల వాన, ఈదురుగాలులతో పంటపొలాలు దెబ్బతిన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఘండ్ మీదుగా ఒడిశా వరకూ విస్తరించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల 36 గంటలు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ.
గ్యాస్ అయిపోయిందన్న బాధ ఉండదు .. త్వరలో సోలార్ స్టవ్ అందుబాటులోకి !
ఇప్పటికే బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఘండ్ మీదుగా ఒడిశా వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ వరకూ మరో ద్రోణి ఏర్పడటంతో బంగాళాఖాతం మీదుగా రాష్ట్రంలోని తేమగాలులు వీస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి.
Share your comments