News

ప్రపంచ దేశాలకు అధ్యక్షులుగ ఉన్న భారత సంతతి బిడ్డలు వీరే..!

Srikanth B
Srikanth B
ప్రపంచ దేశాలకు అధ్యక్షులుగ ఉన్న భారత సంతతి బిడ్డలు వీరే!
ప్రపంచ దేశాలకు అధ్యక్షులుగ ఉన్న భారత సంతతి బిడ్డలు వీరే!

 

భారత దేశాన్ని బ్రిటీష్ వారు పాలించిన చరిత్ర ఒకెత్తూ అయితే నేడు అదే బ్రిటిష్ రాజ్యాన్ని భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్‌ ప్రధాని కావడం భారత దేశాన్ని గర్వపడేలా చేసింది . గత రెండు నెలల క్రింద బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్‌ ట్రస్‌ 45 రోజులలో రాజీనామా చేయడంతో తదుపరి ప్రధానిగా కన్సర్వేటివ్ పార్టీకి చెందిన రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .

 

వివిధ దేశాలలో కీలక స్థానాల్లో ఉన్న భారతీయ సంతతి వ్యక్తులు :

కమలా హ్యారిస్‌ - అమెరికా ఉపాధ్యక్షురాలు: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు . ఆమె పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తులసేంద్రిపురానికి చెందినవారు. కమలా హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందిన వారు.

పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ - మారిషస్‌ అధ్యక్షుడు: మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ కుటుంబం కూడా భారత ఆర్యసమాజ్‌ హిందూ కుటుంబానికి చెందినదే. పలుమార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. 2019లో మారిషస్‌ అధ్యక్షుడు అయ్యారు.
చంద్రికా ప్రసాద్‌ సంతోఖి (చాన్ సంతోఖి), సురినామ్‌ అధ్యక్షుడు: దక్షిణ అమెరికాలోని సురినామ్‌ దేశాధ్యక్షుడిగా చంద్రికా ప్రసాద్‌ సంతోఖి కొనసాగుతున్నారు. 1959లో జన్మించిన ఆయన కుటుంబం కూడా భారత మూలాలున్నదే.

రిషి సునాక్‌- బ్రిటన్‌ నూతన ప్రధాని:భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్‌ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌ నగరంలో జన్మించిన రిషి పూర్వీకుల మూలాలు భారత్‌లోని పంజాబ్‌లో ఉన్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లారు. బోరిస్‌ జాన్సన్‌ హయాంలో బ్రిటన్‌ ఆర్థికమంత్రిగా పనిచేసి మంచి గుర్తింపు పొందిన రిషి సునాక్‌.. తాజాగా ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

ప్రపంచ శాంతి మరియు సామరస్యానికి ప్రతీక గ ప్రపంచంలోనే అతిపెద్ద దీపం

ఆంటోనియా కోస్టా - పోర్చుగల్‌ ప్రధానమంత్రి: గోవా మూలాలున్న ఆంటోనియో కోస్టా పోర్చుగల్‌ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆంటోనియో కోస్టా తండ్రి ఆర్నాల్డో డా కోస్టా.. గోవాకు చెందినవారు.

మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ - గయానా అధ్యక్షుడు: ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ.. 2020లో గయానా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

ప్రవింద్‌ జుగ్నాథ్‌ - మారిషస్‌ ప్రధానమంత్రి : మారిషస్‌ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టిన ప్రవింద్‌ జుగ్నాథ్‌ భారత మూలాలున్న హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి.

పైన పేర్కొన్న స్థానాలలో కాకుండా ఫ్రపంచవ్యాప్తముగా భారతీయ సంతతి వారు వివిధ కీలక స్థానంలో ఉన్నారు .

ప్రపంచ శాంతి మరియు సామరస్యానికి ప్రతీక గ ప్రపంచంలోనే అతిపెద్ద దీపం

Share your comments

Subscribe Magazine

More on News

More