ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా వీటిని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. ఇప్పటికే 7 విడతల నగదును జమ చేయగా.. 8వ విడత సొమ్మును మార్చిలో రైతుల ఖాతాల్లో వేయనుంది.
అయితే పీఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందుతున్న రైతులు రూ.6 వేల ఆర్థిక సహాయంతో పాటు మరో మూడు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ విషయాలు చాలామందికి తెలియవు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1. పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిపొందుతున్న లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు సులువుగా వస్తాయి. ఈ కార్డు ద్వారా రైతులు రూ.3 లక్షల వరకు చాలా తక్కువ వడ్డీకే బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. వడ్డీ రేటు 4 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.
2. ఇక పీఎం కిసాన్ లబ్ధిదారులు పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఈ పథకం చేరితే అనేక ప్రయోజనాలు ఉంటాయి.
3. ఇక పీఎం కిసాన్ పథకంలో లబ్ధిదారులైన రైతులందరికీ ఒక ఫార్మర్ ఐడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఐడీ ద్వారా రైతుల భూములను లింక్ చేయాలని భావిస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ పథకాల నుంచి నేరుగా రైతులు ప్రయోజనం కలగనుంది.
Share your comments