News

ముదురుతున్న తిరుపతి లడ్డు వివాదం; దర్యాప్తు పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

KJ Staff
KJ Staff
Tirupati Laddu Controversy: Union Food Minister Pralhad Joshi Calls for Investigation into Andhra CM Naidu's Claims of Animal Fat Usage
Tirupati Laddu Controversy: Union Food Minister Pralhad Joshi Calls for Investigation into Andhra CM Naidu's Claims of Animal Fat Usage

తిరుపతి శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం పై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, శ్రీవారి భక్తులు ఈ ఘటనపై మండిపడుతున్నారు, లడ్డు కల్తీకి పాల్పడిన వారిపై తీవ్రంగా మండిపడుతున్నారు.

అదేక్రమంలో క్రమంలోనే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడటం పట్ల తాజాగా కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేసారు. ఘటనపై వెంటనే సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తామని అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగ స్పందించారు.

ఏపీ సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో నాసిరకం పదార్థాలు మరియు జంతువుల కొవ్వును వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు.

కేవలం వీరికే రైతుభరోసా ;తెలంగాణ వ్యవసాయ మంత్రి కీలక ప్రకటన

‘‘తిరుమలలో లడ్డూ, అన్నదాన ప్రసాదం నాణ్యత తగ్గించారు .. తిరుమల లడ్డూలో కూడా నాసిరకం పదార్థాలతో తాయారు చేసారు .. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వినియోగించారు .. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేడు నాణ్యమైన నెయ్యి వాడుతున్నాము . ఆంధ్రప్రదేశ్‌లో ఇంతటి పవిత్రమైన దేవాలయం ఉండటం మన అదృష్టం, అందుకే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రక్షించడం మా కర్తవ్యం."నిన్న జరిగిన ఎన్‌డిఎ శాసనసభా పక్ష సమావేశంలో ప్రసంగిస్తూ నాయుడును అన్నారు.

ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నారని, ఆలయంలో అన్నీ శానిటైజ్‌ చేశామని, దీనివల్ల నాణ్యత మెరుగుపడుతుందని సీఎం చెప్పారు.

అయితే నాయుడు ఆరోపణ దురుద్దేశంతో కూడుకున్నదని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

కేవలం వీరికే రైతుభరోసా ;తెలంగాణ వ్యవసాయ మంత్రి కీలక ప్రకటన

Share your comments

Subscribe Magazine

More on News

More