గుంటూరు జిల్లా తెనాలిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈరోజు పర్యటించనున్నారు. రైతులకు గుంటూరులో ఉన్న మార్కెట్ యార్డులో బహిరంగ వేదికపై రైతు భరోసా మరియు ఇంపుట్ సబ్సిడీ మొత్తాన్ని బటన్ నొక్కి రైతుల అకౌంట్ లో జమ చేయనున్నారు. ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చాలా బాగా ఉపయోగపడి వారికీ అండగా నిలుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం నాలుగో ఏడాది 3వ విడతను విడుదల చేయనున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలు కలిపి రూ.5,853.74 కోట్లను 50.92 లక్షల మందికి ఆర్ధిక సహాయం అందించింది. ఇది ఇలా ఉంటె మూడో విడతలో రూ.1,090.76 కోట్లను 51. 2 లక్షల రైతులకు ఈ మంగళవారం తెనాలి మార్కెట్ యార్డులో జరిగే కార్యక్రమంలో నేరుగా రైతు అకౌంట్ లోకి ముఖ్యమంత్రి జమ చేయనున్నారు.
క్రిందట సంవత్సరంలో మండస్ తుఫ్ఫాను రైతులను చాలా నష్ట పరిచింది. అప్పుడు ముఖ్యమంత్రి ఆ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందజేస్తానని మాట ఇచ్చారు. దీని కొరకు ఏకంగా రూ.76.99 కోట్లను 91,237 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రైతుల అకౌంట్ లో జమ చేయనున్నారు.
ఇది కూడా చదవండి..
రైతులకు శుభవార్త :ఫిబ్రవరి 27న PM కిసాన్ విడుదల .. లబ్ధిదారుల జాబితా చెక్ చేయండి ఇలా
ప్రతి విడతకు రూ.2 వేలా చొప్పున ప్రతి రైతు యొక్క ఖాతాలోకి జమచేస్తున్నారు. ఈవిధంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి రూ.27,062.92 కోట్లను వేసి వారికీ ఆర్హిక సహాయం చేసారు. దీనితో పాటు మందస్ తుఫాను ప్రాభవంతో నష్టపోయిన రైతులకు ఉద్యాన మరియు వ్యవసాయ రైతులకు రూ.76.99 కోట్లను ఇన్పుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మొత్తానికి రూ.1,45,751 కోట్లను ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో వేసి వారికీ లబ్ధిని అందజేశారు. ఈ పథకాలతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 22. లక్షల మంది రైతులు లబ్ది పొందారు.
ఇది కూడా చదవండి..
Share your comments