తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆదివారం తో ప్రారంభం కానున్నఈ పండుగ 9 రోజుల పాటు కొనసాగుతుంది . మొదటి రోజు ఎంగిలి పులా బతుకమ్మ తో మొదలై 9 వ రోజు సద్దుల బతుకమ్మ తో ముగుస్తుంది .
బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి నృత్యాలు, పాటలు పాడుతూ పండుగను ప్రజలు జరుపుకుంటారు . ఇక బతుకమ్మ పండుగలో భాగంగా రెండో రోజైన శనివారం (సెప్టెంబరు 29) ఆశ్వయుజ లేదా ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు 'అటుకుల బతుకమ్మ'గా అమ్మవారిని పూజిస్తారు. దేవీ శరన్నవరాత్రులు కూాడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి.
బతుకమ్మను పేర్చడానికి అవసరమైన పూలకోసం ఉదయాన్నే అడవికి వెళ్లి తంగేడు, గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో నిమజ్జనం చేస్తారు. నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు. ఈ రోజు అటుకులను వాయనంగా ఇస్తారు.
Bathukamma : బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కెసిఆర్ !
బతుకమ్మ పండుగ జరిగే 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో 'బతుకమ్మ' పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్లాపెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది..
అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. తెలంగాణ సంస్కృతికి, మహిళల ఆత్మగౌరవానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని , తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రజలు ప్రకృతిని ప్రార్థిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తారని ముఖ్యమంత్రి అన్నారు.
Share your comments