రూ. 2000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి తొలగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. దేశంలో మార్కెట్ నుండి ఈ రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే నెల 19వ తేదీన అధికారికంగా ప్రకటించింది. ప్రజలు ఈ నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు RBI గడువు ఇచ్చి, తాజాగా ఆ గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. ఆ గడువు నేటితో ముగుస్తుంది.
అక్టోబర్ 8వ తేదీ నుంచి 2,000 రూపాయల నోట్ల చలామణికి పూర్తిగా బ్రేక్ పడుతుంది. ఈ పరిస్థితుల మధ్య తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 3.62 లక్షల కోట్ల వరకు 2,000 నోట్ల రూపాయల నోట్లు చలామణిలో ఉండేవని, మే 19వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.56 లక్షల కోట్లకు తగ్గిందని తెలిపారు.
వివిధ బ్యాంకుల నుండి పొందిన డేటా ప్రకారం, సెప్టెంబర్ 1 నాటికి, 3.32 లక్షల కోట్ల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి తిరిగి వచ్చాయి. దేశంలో చలామణిలోకి పంపబడిన మొత్తం 2,000 రూపాయల నోట్లలో 93 శాతం విజయవంతంగా జులై 31 నాటికి తిరిగి వచ్చినట్లు RBI ఇటీవల వెల్లడించింది.
ఇది కూడా చదవండి..
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు..
శక్తికాంత దాస్ ప్రకారం, మార్కెట్‌లో ప్రస్తుతం చెలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్ల విలువ 12,000 కోట్ల రూపాయలు. ఈ నోట్లలో గణనీయమైన భాగం, దాదాపు 3.37 శాతం, ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేదని ఇది సూచిస్తుంది. తదుపరి విశ్లేషణ ప్రకారం, మొత్తం చెలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లలో, 96 శాతం ఇప్పటికే తిరిగి వచ్చాయి.
నోట్ల మార్పిడి గడువును పొడిగించే ప్రసక్తే లేదని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఈ రూ.2000 నోట్ల చెలామణి అక్టోబరు 8 నాటికి పూర్తిగా నిలిచిపోతుందని, ప్రజలు అక్టోబరు 8వ తేదీ తరువాత వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేరని ఆయన తెలిపారు. రేపటి నుండి రూ. 2,000 నోట్లను తీసుకోవడాన్ని బ్యాంకులు నిలిపివేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments