అకాల వర్షాలు టమాటో పంటను తీవ్రమైన నష్టం కల్గించాయి దీనితో టమాటో ధరలు ఆకాశాన్ని తాకాయి , సామాన్య మధ్య తరగతి ప్రజలు అయితే టమాటో కొనడానికి భయపడుతున్నారు కొన్ని ప్రాంతాలలో టమాటో ధర ఏకంగా 200 రూపాయలను దాటేసింది ఇది సాధారణ ధర కంటే 300 రేట్లు అధికం.
ఒకవైపు ఇది సామాన్య ప్రజలకు నష్టం కల్గించిన రైతులకు మాత్రం భారీ లాభాలను తెచ్చి పెడుతుంది అలాంటిదే ఈ వార్త టమాటో రైతు ఒక్క రోజులో లక్షాదికారిగా మారిపోయాడు కర్ణాటకలోని ఓ రైతు కుటుంబం టమాటాల అమ్మకంతో లక్షాధికారి కుటుంబంగా మారింది. కోలార్ జిల్లాకు చెందిన రైతు కుటుంబం మంగళవారం 2 వేల బాక్స్‌ల టామాటాను మార్కెట్‌లో అమ్మగా.. బాక్స్‌కు రూ.1,900 చొప్పున రూ.38 లక్షలు వచ్చాయి. దాంతో ఆ రైతు కుటుంబం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రభాకర్ గుప్తా అనే రైతుకు కోలార్ జిల్లాలోని బేథమంగళలో 40 ఎకరాల పొలం ఉంది. ఆయన మంగళవారం 15 కేజీల బాక్స్ టమాటాలను అమ్మాడు. ఒక్కో బాక్స్ రికార్డు స్థాయిలో రూ.1,900 పలికింది.
అదే విధంగా చింతామణి తాలూకాలోని వైజకూర్ గ్రామానికి చెందిన వెంకటరమణా రెడ్డి 15 కేజీల బాక్స్‌ను రూ.2,200కు అమ్మారు. ఆయన మొత్తం 54 బాక్స్‌లను కోలార్ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చి అమ్మారు. దీనితో ఇద్దరు రైతుల సంతోషానికి అవధులు లేవు ఎప్పుడు నష్ఠాలను చవి చూసే రైతు ఇప్పుడు టమాటో పుణ్యమాన్ని లక్షల్లో సంపాదిస్తున్నారు.
Share your comments