పెరిగిన టమాటో ధర కొందరిని మురిపిస్తుంటే కొందరిని మాత్రం ఏడ్పిస్తుంది. టమాటో పంట పండించిన కొందరు రైతులు చాల సునాయాసంగా పంటను అమ్ముకుంటుంటే కొందరు రైతుల పంటలు మాత్రం లూటీ చేసి దొంగలు ఎత్తుకుపోతున్నారు . టొమాటోల చోరీ ఒకఎత్తు అయితే నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ జిల్లాలో టమాటా రైతు హత్య చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.
గత ఏడు రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ జిల్లాలో ఇద్దరు టమాటా రైతు హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.
అన్నమయ జిల్లా పెద్ద తిప్ప సముద్రం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి తన పొలంలో పంటలకు కాపలాగా నిద్రిస్తున్న రైతు మధుకర్‌రెడ్డిని దుండగులు గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఘటన అనంతరం డీఎస్పీ కేశప్ప సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నామని, ఘటనపై విచారణ చేయాల్సి ఉందని, మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు.
జగనన్న తోడు పథకం నిధులు విడుదల... ఖాతాల్లో 10 వేలు జమ !
గతంలో అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బోడుమల్లదిన్నె గ్రామంలో 62 ఏళ్ల టమోటా రైతు హత్యకు గురయ్యాడు. మృతుడు నరెం రాజశేఖర్ రెడ్డిగా గుర్తించారు.
Share your comments