మార్కెట్లో ఏదైనా వస్తువు కొనడానికి సామాన్యులకు చుక్కలు కనిపిస్తాయి , అదే రైతు పంట పండించే అమ్మడానికి వెళ్తే మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా దక్కని దుస్థితి ,అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నా చదనంగా మారింది మార్కెట్లో టమాటో రైతుల దుస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు గిట్టుబాటు ధర లభించక నానా ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లె మార్కెట్ కు రికార్డు స్ధాయిలో టమాటలు రావడం తో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి .
బయట మార్కెట్లలో కిలో టమాటో 15 నుంచి 20 రూపాయల వరకూ ధర పలుకుతోంది అదే సూపర్ మార్కెట్లో కేజీ 25 రూపాయల పైన నే వున్నాయి ధరలు
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్టుగా మారింది టమోటా రైతుల (Tomato Farmers) పరిస్థితి. మార్కెట్లోకి వెళ్ళి టమోటా కొనే వినియోగదారులు భారీగా ధర చెల్లించాల్సి వస్తోంది.
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం ఉచితంగా 2 కిలోల రాగుల పంపిణి.. ఎక్కడో తెలుసా?
ఇటీవల కాలంలోని సకాలంలో వర్షాలు పడడంతో దిగుబడి కూడా భారీగానే ఉంది.585 టన్నుల టమోటాను మార్కెట్ కు తీసుకొని వచ్చిన రైతులు..ధర లేక ఆందోళన చెందుతున్నారు. కేజీ టమోటా ధర ప్రస్తుతం 2 కేవలం 3 ధర మాత్రమే పలుకుతుంది రూపాయలు పలుకుతుంది.
రవాణా , కూలీ ఖర్చులు అన్ని పొగ రైతులకు ఏమి మిగలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు , రైతులకు నేరుగా మార్కెట్ యార్డుల ద్వారా పంటను అమ్ముకునే సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు .
Share your comments