గత కొన్ని నెలలుగా వినియోగదారులకు చుక్కలు చూపించిన టమాటో ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి ..వారం క్రితం కొన్ని రాష్ట్రాలలో కిలో 200 ధర పలికిన టమాటో ఇప్పుడు కాస్త తగ్గి అన్ని రాష్ట్రాలలో కిలో రూ.100 కు చేరింది . తెలుగు రాష్ట్రాలలో అయితే రకాన్ని బట్టి కిలో 30 నుంచి 50 రూపాయలకు చేరింది . తగ్గినా ధరతో సామాన్యులు సంతృప్తిగా వున్నా టమాటో రైతులలో మాత్రం ఆందోళన నెలకొంది రానున్న రోజులలో కిలోరూ. 10 కి పడిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు .
నేషనల్ కమోడిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్‌సిఎంఎల్) మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ సంజయ్ గుప్తా ప్రకారం.. ఈ నెలాఖరు నాటికి సరఫరా పెరుగుతుంది కాబట్టి, సెప్టెంబర్ మధ్య నాటికి ధరలు గణనీయంగా తగ్గి కిలో రూ. 30కి చేరుకుంటాయని ఆయన భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అయితే టమాటో ధరలు ఇప్పటికే భారీగ పడిపోయాయి .
ఆగస్టు రెండో వారం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి టమాటాలు మార్కెట్‌లకు రావడం ప్రారంభమయ్యాయి. టొమాటోలు ఎక్కువగా పండే నాసిక్, కోలార్ ప్రాంతాల నుండి వస్తున్నాయి. రైతులు కూడా కూరగాయల వినియోగాన్ని నిలిపివేసి పట్టణ ప్రాంతాలకు పెద్దఎత్తున సరుకులు పంపుతున్నారు. దీనితో టమాటో ధరలు దిగివస్తున్నాయి .
ప్రస్తుతం హైదరాబాద్ రైతు బజార్ లో టమాటో ధర 35 గ మరికొన్ని జిల్లాల్లో 35-50 మధ్య ఉంది. మార్కెట్ కు రోజు రోజు కొత్త పంట వస్తుండడంతో ధరలు మరింతగ తగ్గనున్నాయి.
Share your comments