తెలంగాణలోని ములుగు జిల్లా అడవులను బుధవారం నాడు టోర్నడో లాంటి గాలులు బలంగా వీయడం తో ములుగు జిల్లా మేడారం అడవుల్లోని 200 హెక్టార్ల అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నేలకూలాయి.
విజువల్స్ భారీ ప్రకృతి వైపరీత్యాన్ని ప్రతిబింబిస్తాయి.
ములుగు జిల్లా మేడారం-తాడ్వాయి మధ్య రిజర్వ్ ఫారెస్టులో చెట్లు నేలకొరిగాయి.
రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ ఘటన జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జిల్లా అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
Share your comments