తెలంగాణాలో ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగ గత వారం రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి . ఆ వర్ష దాటికి రాష్ట్రంలో వాగులు , వంకలు ,డ్యాంలు పొంగి పొరుళుతున్నాయ్ భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ప్రభుత్వం విద్య సంస్థలకు సెలవులను ప్రకటించింది. మరో వైపు రానున్న 3 రోజులపాటు వర్షాలు కురుస్తాయని , రాష్ట్రంలోని పలు జిల్లాకు రెడ్ అలెర్టును జారీ చేసింది వాతవరణ శాఖ.
నేడు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు మరియు అసాధారణమైన వర్షం 24cm వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరిజిల్లాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణశాఖ .
రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశంవుందని ప్రకటించింది .
అవకాశం ఉంది. వీటితోపాటు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40-50 కి.మీ.తో వీచే
అవకాశం ఉంది.
Share your comments