News

భూమిని చదును చేస్తుండగానే రైతుకు బంగారు పంట పండింది..!

KJ Staff
KJ Staff

సాధారణంగా రైతులు వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉన్న సమయంలో కొందరి రైతులకు తమ పొలంలో బంగారు పంట పండుతుంది. పంట పొలంలో లంకెబిందెలు లభ్యం కావడం మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. తాజాగా ఇలాంటి లంకె బిందె సూర్యాపేట జిల్లాలో ఓ రైతు పొలంలో లభించింది. అయితే ఈ లంకె బిందె దొరికిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈవిధంగా దొరికిన లంకె బిందెలో ఉన్న బంగారం పంపకాలలో ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదానికి దారి తీయడంతో ఈ విషయం బయటపడింది. అసలు పూర్తి వివరాల్లోకి వెళితే ..

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తుల్జారావుపేట గ్రామంలో ఓ రైతు ట్రాక్టర్ తో తన స్థలాన్ని చదును చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ రైతుకు తన పొలంలో ఒక లంక బిందె దాని నిండా బంగారం లభించింది. ఈవిధంగా దొరికిన లంకె బిందెలోని బంగారాన్ని ముగ్గురు వ్యక్తులు పంపకాలు చేసుకోవడంలో వివాదం తలెత్తింది. వీరి మధ్య వివాదాన్ని ఓ హోం గార్డ్ సెటిల్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ లంకె బిందెలో దొరికిన బంగారాన్ని ఒకరికి 14 లక్షలు, మరొకరికి పది లక్షలు చొప్పున ఇచ్చారు.మిగతా బంగారాన్ని అమ్మి తనతో పాటు మరొక వ్యక్తి పంచుకునే విధంగా హోంగార్డ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విధంగా రైతు పొలంలో బంగారంతో నిండిన లంక బిందె చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ వార్త ఆ గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Share your comments

Subscribe Magazine

More on News

More