రాష్ట్రంలో పండించే 123 రకాల పంటలకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల లిమిట్ ను తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. వచ్చే వ్యవసాయ సీజన్ నుంచి ఈమేరకు రుణ పరిమి తిని అమలు చేయనున్నారు. పంట సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ పరిమి తిని నిర్ధారిస్తారు.
పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.45వేలు చొప్పున రుణపరిమితిని టెస్కాబ్ ఖరారు చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో వరికి గతేడాది రూ. 40 వేల వరకు క్రాప్టోన్స్ ఇవ్వగా.. వచ్చే సీజన్ నుంచి రూ. 42 వేల నుంచి రూ. 45 వేల దాకా ఇవ్వనున్నారు. లాస్ట్ ఇయర్ కంటే వరికి ఎకరానికి రూ. 6 వేలు దాకా లోన్ లిమిట్ ను పెంచారు. శ్రీ పద్ధతిలో సాగు చేసే వరికి లోన్ లిమిట్ ను ఎకరాకు రూ.36 వేల నుంచి రూ.38వే లకు పెంచారు. వరి సీడ్ సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.5 వేలు అదనంగా పెంచారు.
నిర్ణయించిన లోన్ పరిమితులు ఇవే :
సీడ్ లెస్ ద్రాక్షకు ఎకరాకు రూ. 1.30 లక్షలు
సోయాబీన్ సాగుకు ఎకరానికి -26 -28 వేలు
ఔషద మొక్క సాగు చేసేవారికి ఎకరానికి 42-48 వేలు
డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఎకరాకు రూ. 65 -75వేలు
సీడ్ లెస్ ద్రాక్షకు రూ.1.25లక్షల నుంచి రూ. 1.30 లక్షల వరకు
పత్తి సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 42-45 వేలు
మిర్చి మిర్చి సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.75 -80 వేలు
పామ్ ఆయిల్ సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 40-45 వేలు
రైతులకు శుభవార్త: అన్నదాతలకు అందుబాటులోకి రానున్న కిసాన్ డ్రోన్లు..
అనుబంధ రంగాలకు రుణ పరిమితి :
జీవాల పెంపకానికి -రూ. 26 వేల నుంచి రూ. 28 వేలు
గొర్రెల పెంపకానికి రూ.23 వేలు
గొర్రెల పెంపకానికి రూ.23 వేలు
పందుల పెంపకానికి -53 వేలు
బర్రెకు రూ. 25 వేల నుంచి రూ.27 వేలు
చేపల పెం పకానికి హెక్టారుకు రూ. 4 లక్షల లోన్ ఇవ్వాలని టెస్కాబ్ నివేదించింది .
Share your comments