తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఇటీవల రాఖీ పౌర్ణమి నాడు ప్రయాణించాలనుకునే మహిళా ప్రయాణికుల కోసం మంచి శుభవార్తను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రాను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ లక్కీ డ్రాలో గెలిచిన వారికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులు అందించనుంది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది.
ఈ నెల 30, 31 తేదీల్లో టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులందరూ ప్రత్యేక లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. దీనిలో పాల్గొనడానికి, మీ ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత మీ టికెట్ వెనుక మీ పేరు మరియు ఫోన్ నంబర్‌ను రాయాలి. వివరాలను రాసిన తర్వాత వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలి.
ఆ డ్రాప్ బాక్స్లను అన్నిటిని సేకరించి, ఒక చోట పెట్టి ముగ్గురి చొప్పున ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా ద్వారా అధికారులు విజేతలను ఎంపిక చేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు. స్త్రీలు రాఖీ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు, వారు ఈ పండుగను అత్యంత భక్తితో జరుపుకుంటారు. వారు తమ ప్రియమైన సోదరులకు రాఖీలు కట్టడానికి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. సోదరభావం మరియు ఆప్యాయతలను పెంపొందించే స్ఫూర్తితో, సంస్థ TSRTC బస్సులలో ప్రయాణించే మహిళల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రాను ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి..
సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.!
సెప్టెంబర్ 9న లక్కీ డ్రాలు జరుగుతాయని, విజేతలకు బహుమతులు అందజేస్తామని టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జన్, ఐపీఎస్ తెలిపారు. రాఖీ పౌర్ణమికి సంబంధించిన లక్కీ డ్రాకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందేందుకు వ్యక్తులు TSRTC కాల్ సెంటర్‌ను 040-69440000 మరియు 040-23450033 ఫోన్ నంబర్‌ల ద్వారా సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..
Share your comments