News

TSRTC :మరింత భారం కానున్న RTC ప్రయాణం !

Srikanth B
Srikanth B

డీజిల్ ధర ఇప్పుడు ₹105.47గా ఉన్నందున, ఈ డీజిల్ సెస్‌ను ప్రవేశపెట్టే చర్య చాలా చర్చల తర్వాత జరిగిందని TSRTC వర్గాలు తెలిపాయి. ప్రధానంగా డీజిల్ ధరల కారణంగా టీఎస్‌ఆర్‌టీసీకి రోజుకు ₹7 కోట్ల మేర నష్టం వాటిల్లడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

 

TSRTC యాజమాన్యం ప్రకారం, పల్లెవెలుగు మరియు సిటీ ఆర్డినరీ బస్సులపై ఒక్కో ప్రయాణీకునికి ₹2 చొప్పున డీజిల్ సెస్ విధించబడుతుంది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ మరియు మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి సేవల కోసం, ₹5 డీజిల్ సెస్ విధించబడుతుంది.

టీఎస్‌టీఆర్‌సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌, చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ రవాణా రంగానికి ఇది కష్టకాలమని అన్నారు. టిఎస్‌ఆర్‌టిసికి మద్దతు ఇవ్వాలని వారు ప్రజాప్రతినిధులను అభ్యర్థిస్తున్నారు.

తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులపై భారం పడకుండా పల్లువెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస ధర ₹10ని సవరించలేదని సజ్జనార్ తెలిపారు.

బస్‌పాస్‌లు వాడే వారు కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది . సిటీ ఆర్డినరీ బస్సులకు ₹ 950 పాస్ ఛార్జీ  నుంచి ₹ 1,150కి పెంచబడింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే వారు ₹1,070కి బదులుగా ₹1,300 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర TSRTC బస్సు సర్వీసుల్లో కూడా ఇదే విధంగా  బస్ పాస్ ధర పెరిగింది

KVS Admissions latest : కేంద్రీయ విద్యాలయ లో 2 నుండి 12 వ తరగతి అడ్మిషన్ లకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం !

Related Topics

TSRTC introduced RTC buses

Share your comments

Subscribe Magazine

More on News

More