ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ మేడ్చల్ -మెహదీపట్నం మధ్య నూతన 20 నిమిషాల వ్యవధిలో మొత్తం ఆరు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రతిరోజూ ఉదయం 6.40 నుండి సాయంత్రం 7.20 గంటల మధ్య 24 ట్రిప్పులు వేస్తాయి.
గ్రేటర్ హైదరాబాద్ (జిహెచ్) రీజియన్ ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) సోమవారం మేడ్చల్-మెహదీపట్నం మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన రూట్‌లో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించింది.
20 నిమిషాల ఫ్రీక్వెన్సీతో మొత్తం ఆరు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఈ మార్గంలో ప్రతిరోజూ ఉదయం 6.40 నుండి రాత్రి 7.20 గంటల మధ్య దాదాపు 24 ట్రిప్పులు నడపనుంది TSRTC. అలాగే మెహదీపట్నం నుంచి మేడ్చల్‌కు ఉదయం 8.20 నుంచి రాత్రి 9.05 గంటల మధ్య ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఎకరం పైన భూమి ఉన్న రైతులకు నేటి నుంచి రైతుబంధు ..!
గతంలో ఈ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు తక్కువ ఫ్రీక్వెన్సీ కారణంగా ఇబ్బందులు పడేవారని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
Share your comments