గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వేప చెట్లు వైరస్ మరియు ఫంగస్ బారిన పడి ఎండిపోతున్న విషయం తెలిసినదే మరి ఇలాంటి సందర్భంలో ఉగాది పండగ రోజున ప్రత్యేకంగా పచ్చడిలో వేప పూతని తినవచ్చ లేదా అనే విషయాన్నీ తెలుసుకుందాం.
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో మరియు తెలంగాణలో వేప చెట్లకి ' డైబ్యాక్ ' అనే ఫంగల్ వ్యాధి సోకి వేప చెట్లన్నీ ఎండిపోయిన సంగతి తెలిసిందే. యొక్క కొమ్మలు, ఆకులు, పువ్వులు, బెరడు, విత్తనాలలో మంచి ఔషధ గుణాలని కలిగి ఉన్న వేప చెట్టు ఒక్క సారిగా తెగులు బారిన పడింది.వేప సహజంగానే క్రిమిసంహారక మందు కానీ ఇప్పుడు అవే వేపచెట్లకి తెగులు సోకింది.ఇది తరచుగా వేప చెట్లను, ముఖ్యంగా పాత చెట్లను చంపుతుంది. చిన్న మరియు బలమైన వేప చెట్లు, వాటి కొమ్మలు ఎండిపోయినప్పటికీ, దాడి నుండి బయటపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్టెంబోరర్ కీటకాలు కొమ్మలలో రంధ్రాలను వదిలివేసిన తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ దాడి చేస్తుంది. అధిక తేమ మరియు వాతావరణ పరిస్థితుల్లో మార్పు కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు.
ఉగాది పచ్చడి లో వేప పూత వాడవచ్చా?
ఇప్పడు అందరి మదిలో మెదులు తున్న ప్రశ్న ఇది. ఇప్పుడిప్పుడే కొరోనా బారి నుండి ప్రజలు కోలుకున్నారు ఇలాంటి సమయంలో వేప పూత తింటే దాని ద్వారా వ్యాధి కారకాలు మన శరీరం లోకి ఏమైనా వ్యాపిస్తాయ, ఇది ఆరోగ్యకరమేనా అని ప్రజలు భయపడుతున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తూ డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి ముందుకు వచ్చారు. ఇతను ఆచార్య జయ శంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉగాది పచ్చడిలో వేపపూతని ఎలాంటి సమస్య లేకుండా తినొచ్చని వీరు స్పష్టం చేసారు. వేప చెట్టుకి వచ్చిన తెగులు తాత్కాలికమని తెగులు వేపపూతలో ఏమి లేదని వ్యాఖ్యానించారు.
మరిన్ని చదవండి.
Share your comments