అస్సాం, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(IARI), లో కొత్తగా నిర్మించిన నూతన విద్య భవనాలను, అతిధి గృహాలను, హాస్టల్స్ ను, మార్చ్ 4, 2024 న యూనియన్ అగ్రికల్చర్ అశోక్ ముండా వర్చ్యువల్ గ పార్రంభించారు. ఈశాన్య భారత దేశం ప్రగతి పధంలో ముందుకు సాగడానికి మోడీ ప్రభుత్వం ఎల్లపుడు కృషి చేస్తుంది అని అయన ప్రసంగించారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయ లోటు పాట్లను సరిచేసి, పురోగతిచెందేలా చెయ్యడం ఎంతో ఆవశ్యకమని ఆయన తెలిపారు. భరత్ దేశమలోని అన్ని రాష్ట్రాలు కలిసి కట్టుగా మందుకు సాగినప్పుడే దేశం ఆర్ధికంగా బలపడి, 2047 కల్లా ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అనే ప్రభుత్వం కల నిజం అవుతుంది అని చెప్పారు.
వంట నూనె దిగుమతి ద్వారా దేశంపై ఎంతో భారం పడుతుంది. ఈ భారాన్నితగ్గించి ఇండియాని, వంట నూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చవలసిన అవసరం ఉంది. ఈ దిశలోనే భరత్ రూ.11,000 కోట్ల రూపాయిలు వంట నూనె పంటలు ఉత్పత్తిని పెంచే పరిశోధనలపై వ్యచించనుంది. రాబోయే రోజుల్లో వ్యవసాయ పరిస్థితుల్లో మార్పులను ముందుగానే గుర్తించి, ఆ మార్పులకు తగ్గట్టు ప్రణాళికలను సిద్ధం చేసుకుని పనిచెయ్యాలని మంత్రి సూచించారు.
మన భారత దేశంలోని అగ్రికల్చర్ పరిశోధనా కేంద్రాలు అన్ని రాబోయే మార్పులకు, పంటలను వృద్ధి చేస్తున్నాయి. అస్సాం లోని ఈ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయ అభివృద్ధి పని చేస్తుంది. 2015-16 లో ఇక్కడ పీజీ కోర్సులు ప్రారంభించారు. ఇక్కడ పీజీ పూర్తిచేసిన విద్యార్థులు అందరూ వ్యవసాయ నిపుణులుగా రాణిస్తున్నారు అని మంత్రి తెలిపారు.
ప్రకృతి వైవిధ్యం:
ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకృతి వైవిధ్యం పెంచే దిశగా పని చెయ్యాలని, ప్రారంభోత్సవానికి హాజరయిన మినిస్టర్ అఫ్ స్టేట్ కైలాష్ చౌదరి, శాస్త్రవేత్తలను కోరారు. ఆ రాష్ట్రాలను ప్రకృతి వ్యవసాయం, మరియు సేంద్రియ వ్యవసాయం వైపుగా మార్చవలసిన అవసరం ఉంది అన్నారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రమయిన సిక్కిం లో పూర్తిగా సేంద్రియ వ్యవసాయం అవలంభించారు. మిగిలిన రాష్ట్రాల రైతులు కూడా ఈ పద్దతిని అనుసరించి పర్యావరణహితంగా వ్యవసాయం చెయ్యవలసి ఉంది. ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ Dr. హిమాంశు పథక్ ఈ కార్యకర్మంలో మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయ పరిశోధన కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో వీలైనదిఅని, ఇటునవంటి గొప్ప అవకాశాలు వదులుకునేది లేదని అయన ప్రసంగించారు.
Share your comments