వ్యవసాయ రంగంలో మౌలిక వసతులను మరియు సాంకేతికతను మెరుగుపరచడానికి, అగ్రి స్టార్టప్‌ల యొక్క ఆవశ్యకతను తెలుపుతూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం రూ.750 కోట్ల ఫండ్ 'అగ్రిసూర్' అనే పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భం గ ఆయన వ్యవసాయ రంగంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిరు.
ఈ పథకం ద్వారా దాదాపు రూ. 750 కోట్ల 'అగ్రిసూర్' (స్టార్టప్‌లు & రూరల్ ఎంటర్‌ప్రైజెస్ కోసం అగ్రి ఫండ్) ఈక్విటీ మరియు డెట్ క్యాపిటల్ రెండింటినీ అందించడం ద్వారా స్టార్టప్‌లు మరియు 'అగ్రిప్రెన్యూర్'లకు మద్దతు ఇస్తుంది.
దీనికి సంబంధించి ' కృషినివేష్' పేరుతో సమీకృత అగ్రి ఇన్వెస్ట్‌మెంట్ పోర్టల్' ను మంత్రి ప్రారంభించారు.
ఈ నిధిని వినియోగించుకోవాలని స్టార్టప్‌లను చౌహాన్ కోరారు మరియు వ్యవసాయ రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అగ్రిటెక్ స్టార్టప్‌లకు ఎటువంటి నిధుల పరిమితులు ఉండవని హామీ ఇచ్చారు.
“వ్యవసాయంలో పెట్టుబడులు ప్రభుత్వం వైపు నుండి మాత్రమే కాకుండా ప్రైవేట్ పెట్టుబడులు కూడా అవసరం” అని ఆయన అన్నారు, ఈ రంగంలో ఉత్పత్తిని మరియు విలువ జోడింపును పెంచడానికి పెట్టుబడి అవసరమని ఆయన అన్నారు.
వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ఈ రంగం జిడిపికి 18 శాతం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు ఆహారం, పౌష్టికాహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
Share your comments