కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శుక్రవారం తెలంగాణలోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించి, రైతులు పంట నష్టం నుండి బయటపడేందుకు రాష్ట్రానికి అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భం గ మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.కేంద్ర నిధులను వినియోగించకపోవడం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలను కూడా అమలు చేయకపోవడం వల్ల ప్రస్తుత సంక్షోభంలో రాష్ట్రం ప్రయోజనం పొందలేకపోయిందని ఆరోపించారు.
ఖమ్మం జిల్లాలో ముంపునకు గురైన రైతులతో కేంద్రమంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం తప్పిదంవల్ల నేడు రాష్ట్రము కష్టాలను చూస్తుందని. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కలిసి రైతులకు పరిష్కారం చూపుతుంది. పంట నష్టం నేపథ్యంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
గురువారం ఆంధ్ర ప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరదల ద్వారా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఫసల్ భీమా ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు.
Share your comments