News

వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్

KJ Staff
KJ Staff
Union agriculture minister Shivraj Singh Chowhan visits flood-affected areas of Andhra Pradesh
Union agriculture minister Shivraj Singh Chowhan visits flood-affected areas of Andhra Pradesh

ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను మరియు విజయవాడ లో ఏరియాల్ సర్వే నిర్వహించారు.

ఐటి శాఖ మంత్రి ఎన్.లోకేశ్, కేంద్ర మంత్రి పి.చంద్రశేఖర్, బిజెపి చీఫ్ పురంధేశ్వరితో కలిసి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను సమీక్షించారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాల కారణముగా దాదాపు 35 మంది మరణించారు, రోడ్లు దెబ్బతిన్నాయి, రైలు ట్రాక్‌లు మునిగిపోయాయి మరియు వేలాది ఎకరాలలో పంటలు ముంపునకు గురయ్యాయి. రెస్క్యూ మరియు పునరావాస ప్రయత్నాలు కొనసాగుతున్నందున నివాసితులు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు.

మరోవైపు భారి వర్షాల కారణంగా వరదలో చిక్కుకున్న విజయవాడలో రెస్క్యూ, మరియు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

విజయవాడలో క్రమంగా వరదనీరు తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కాలనీల్లోకి కొట్టుకొచ్చిన బురదను తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సింగ్ నగర్ సమీపంలో వరద మిగిల్చిన బురదను తొలగించేందుకు BRTS రోడ్డుకు పెద్ద ఎత్తున ఫైరింజన్లు చేరుకున్నాయి. మరోవైపు 4వేల పారిశుద్ధ్య కార్మికులను విజయవాడకు తీసుకొస్తామని అధికారులు తెలిపారు.

Share your comments

Subscribe Magazine

More on News

More