ప్రభుత్వ రంగ భూమి మరియు ప్రధానేతర ఆస్తుల ద్రవ్యీకరణను వేగవంతం చేయడానికి నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ ఎల్ ఎంసి) ను పూర్తిగా స్థాయి భారత ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రం ప్రాథమిక నిధులుగా రూ.5,000 కోట్లు మరియు ఎన్ ఎల్ ఎంసి స్థాపనకు రూ.150 కోట్ల సమకూర్చడానికి ఆమోదించింది .
ద్రవ్యీకరణ అంటే ఏమిటి ?
ప్రభుత్వం దగ్గర వున్న ఆస్తుల నుంచి డబ్బును సృష్టించడం .
సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ (సిపిఎస్ ఇలు) మరియు ఇతర ప్రభుత్వ సంస్థల మిగులు భూమి మరియు భవన ఆస్తులను నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ద్రవ్యీకరించనుంది. ఎకో సర్వే ప్రకారం, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటిఎన్ఎల్), బి అండ్ ఆర్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), బిఇఎంఎల్ లిమిటెడ్, మరియు హెచ్ ఎంటి లిమిటెడ్ వంటి సిపిఎస్ ఇలు 3,400 ఎకరాల భూమిని మరియు ఇతర ప్రధానేతర ఆస్తులను ద్రవ్యీకరణ కోసం రిఫర్ చేశాయి.
ఎన్ ఎల్ ఎంసి: ఇది ఎలా పనిచేస్తుంది?
నాన్ కోర్ ఆస్తులను డబ్బుగా మార్చడమే లక్ష్యం నిరుపయోగకరం గ మరియు తక్కువ వినియోగం లో వున్నఆస్తులను విక్రయించడం లేదా లీజు కు ఇవ్వడం ద్వారా సంపద సృష్టించడం దీనియొక్క ముఖ్యమైన విధి
ముందస్తు నివేదికల ప్రకారం, కొత్త సంస్థ కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నియంత్రణలో ఉన్న భూముల యొక్క . భూ ద్రవ్యీకరణ ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మరియు సాంకేతిక బృందం సులభతరం చేస్తుంది.
సంస్థ తన లీజు ఆస్తుల విలువ ఆధారంగా ఈక్విటీ మార్కెట్ నుండి నిధులను సేకరించగలదు.ఈ కార్పొరేషన్ లోఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ సంస్థల శాఖ, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక, రియల్ ఎస్టేట్ పరిశ్రమల వారు ముఖ్య సభ్యులుగా వుంటారు.
ఇంక చదవండి.
హైదరాబాద్ :కంటోన్మెంట్ ప్రాంతాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేత? (krishijagran.com)
Share your comments