ఇప్పటివరకు మనం రాజకీయ నాయకులకి, సినిమా రంగలవాళ్ళకి, మరియు ఉద్యోగస్తులకు సన్మానం చూసి ఉంటాం. కానీ భారత దేశ ఆర్ధిక వ్యవస్థలో అతి కీలక పాత్ర పోషిస్తు, 60% కంటే ఎక్కువ మంది జీవన ఉపాధి పొందుతున్న వ్యవసాయానికి అలాగే సేద్యం చేసే రైతుకు మాత్రం ఎటువంటి సన్మానాలు లేవు. భారత దేశం పురోగతిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న రైతులను గుర్తించి సన్మానించడమే మా కృషి జాగరణ్ ముఖ్య లక్ష్యం. మార్చ్ నెలలో ఏఏ ప్రదేశాల్లో మా ఈ MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ ను నిర్వహిస్తామో పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్:
భారత దేశం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే దేశం. ప్రజల ఆకలి తీర్చడం, కోసం మరియు ప్రజలను ఆకలి చావుల నుండి రక్షించడం కోసం రైతులు అహర్నిశలూ శ్రమిస్తారు. "కష్టే ఫలి " అన్నారు పెద్దలు, కానీ దేశం కోసం తమ చెమటను చిందించి సేద్యం చేసే రైతులను మాత్రం ఎవరు పాటించుకోరు. రైతులు పడుతున్న శ్రమను, గుర్తించి వారికీ గౌరవాన్ని అవార్డుల రూపంలో అందచేసే భాద్యత "కృషి జాగరణ్" చేపట్టింది. రైతులకు మరియు ఇతర వ్యవసాయ వాణిజ్య దారులకు కృషి జాగరణ్ సుపరిచితమే. గత 27 సంవత్సరాలగా రైతుల వికాసానికి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలను కృషి జాగరణ్ చేపట్టింది. సమయానుసరంగా కృషి జాగరణ్ రైతుల కోసం విజ్ఞానాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించి వ్యవసాయం మరింత మెరుగుపడి ముందుకు సాగేలా కృషి జాగరణ్ చేస్తుంది. ఈ రీతిలోనే అనేక రాష్ట్రాల్లో MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ 2024 వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తూ వస్తుంది.
MFOI సంరిద్ కిసాన్ ఉత్సవ్ ముఖ్య ఉదేశ్యం ఏమిటి అంటే, రైతులు అందరికి ఒక వేదికను ఏర్పరచి వారందరిని ఒక్క చోటకు చేర్చి, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త మార్పుల గురించి, లభ్యత లో ఉన్న కొత్త యంత్రాల గురించి తెలియచేసేందుకు ఈ వేదిక ఒక మంచి అవకాశం కల్పిస్తుంది . అంతే కాకూండా రైతులు పంట సమయం లో ఎదుర్కునే కష్టాలను, వాటిని ఎదురుకునే సమర్ధవంతమైన కార్యాచరణాలు ఒకరితో ఒక్కరు పంచుకోవచ్చు. ముఖ్యంగా మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా(MFOI ) అవార్డుల గురించి వాటి విశిష్ఠత గురించి తెలియచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రంలో, సమృద్ధ్ కిసాన్ ఉత్సవ్ సందర్భంగా, వ్యవసాయంలో అద్భుతమైన కృషి చేస్తున్న లక్షాధికారి రైతులను కూడా సత్కరిస్తారు.
MFOI అవార్డులు మీ చెంతకే:
ఇప్పుడు రైతులను పురస్కరించడానికి మీ నగరానికి MFOI అవార్డులు రానున్నాయి. మార్చి నెలలో జరగనున్న MFOI సమృద్ధ్ కిసాన్ ఉత్సవ్ 2024 కార్యక్రమాల జాబితా విడుదల చేయబడింది. MFOI సమృద్ధ్ కిసాన్ ఉత్సవ్ మార్చి నెలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో నిర్వహించబడుతుంది. వివిధ ప్రదేశాల్లో జరగనున్న ఈ ఉత్సవాలో ఒకవైపు వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని, కొత్త సాంకేతికతలను రైతులకు అందజేస్తారు. అదే సమయంలో ఆ ప్రాంతంలోని కోటీశ్వరులైన రైతులను కూడా సన్మానించనున్నారు.
MFOI అవార్డులలో చేరడానికి ఇలా చెయ్యండి:
రైతులే కాకుండా, వ్యవసాయ రంగానికి సంబంధించిన కంపెనీలు మరియు ఇతరులు కూడా MFOI అవార్డులు మరియు MFOI సమృద్ధ్ కిసాన్ ఉత్సవ్ 2024లో భాగం కావచ్చు. అది ఎలాగో చుడండి . కృషి జాగరణ్ మీ అందరినీ ఆహ్వానిస్తున్నది. MFOI 2024 లేదా సమృద్ధ్ కిసాన్ ఉత్సవ్ సమయంలో స్టాల్ బుకింగ్ లేదా ఏ రకమైన స్పాన్సర్‌షిప్ కోసమైనా , మీరు కృషి జాగరణ్‌ని నేరుగా సంప్రదించవచ్చు. అదే సమయంలో, అవార్డుల ప్రదర్శన లేదా ఏదైనా ఇతర ప్రోగ్రామ్‌కు సంబంధించిన
ఏదైనా సమాచారం కోసం, ఈ Google లింక్ పై క్లిక్ చేయండి: https://forms.gle/sJdL4yWVaCpg838y6
MFOI మరి ఈ ఇతర సమాచారం కోసమైనా సరే మా official వెబ్సైటు https://millionairefarmer.in/ ని విసిట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
MFOI అంటే అసలు ఏమిటి?
భారతీయ రైతులు అనగానే ప్రపంచపటం పై ముందుగా కనపడేది, బీడు బడ్డ పొలంలో దిగాలు గ కూర్చున్న రైతు మనకు కనపడతాడు. కానీ వాస్తవం మరొక విధంగా ఉంటుంది. ఆ నిజాన్ని ప్రపంచం ముందు ఉంచేందుకు కృషి జాగరణ్, వ్యవసాయంలో లక్షలు ఆదాయం సంపాదిస్తున్న రైతులను, మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియ అవార్డులతో సత్కరిస్తుంది. ఈ అవార్డులు కేవలం జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశం మొత్తం మీద ఉన్న రైతులు అందరిని గుర్తించి సన్మానిస్తుంది
ఎక్కడెక్కడ ఈ ఉత్సవాలు జరుగుతాయి
'మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డ్-2023' విజయం తర్వాత, ఇప్పుడు కృషి జాగరణ్ రెండవ ఎడిషన్ MFOI 2024ను నిర్వహించబోతోంది. ఇది డిసెంబర్ 1 నుండి 5, 2024 వరకు నిర్వహించబడుతుంది. MFOI 2024 కోసం సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కృషి జాగరణ్ కిసాన్ భారత్ యాత్ర (ఎంఎఫ్‌ఓఐ కిసాన్ భారత్ యాత్ర) ద్వారా రైతులకు కూడా దీనిపై అవగాహన కల్పిస్తోంది. ఈ ప్రయాణం దేశంలోని ప్రతి మూలకు వెళ్లి రైతులకు MFOI గురించి అవగాహన కల్పిస్తుంది మరియు రైతుల కోసం అతిపెద్ద అవార్డు ప్రదర్శనకు వారిని ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం, కిసాన్ భారత్ యాత్ర కొనసాగుతోంది మరియు ఈ యాత్ర మీ నగరం, గ్రామం మరియు పట్టణానికి కూడా రావచ్చు. కాబట్టి, దీనికి సంబంధించిన ప్రతి సమాచారం కోసం కృషి జాగరణ్ వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియాకు కనెక్ట్ అయి ఉండండి. ఇక్కడ, మీరు తక్షణ నవీకరణలను పొందుతారు.
Share your comments