తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కుల మరియు వృత్తిదారులకు శుభవార్త చెప్పిన విషయం మనకి తెలిసినదే. అదేమిటంటే రాష్ట్రంలోని బీసీ కుల మరియు చేతి సహాయం వృత్తిదారులకు రూ.లక్ష అందించే కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి 5 లక్షల మందికి దరఖాస్తు అప్లై చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకం గురించి శుభవార్త అందించింది. రాష్ట్రంలోని బీసీ కుల మరియు చేతి వృత్తిదారులకు సహాయం చేయడానికి బీసీ సంక్షేమ శాఖ వారికి రూ.400 కోట్లను రిలీజ్ చేసింది. అంతేకాదు బీసీలకు లక్ష సాయానికి సంబంధించి తొలి విడతను జులై 15 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో 50 కుటుంబాలకు ఈ సాయాన్ని అందించనున్నారు.
ప్రారంభ దశలో, 119 నియోజకవర్గాల నుండి మొత్తం 5,950 మంది వ్యక్తులు ఈ సహాయాన్ని అందుకోనున్నారు. లబ్ధిదారుల పంపిణీకి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాలకు సమాచారం అందించారు. జూన్ 20 నుండి జూన్ 26 వరకు, మండల మున్సిపాలిటీ స్థాయిలో అధికారులు ఆసక్తి ఉన్న వ్యక్తులు సమర్పించిన దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి అంచనా వేస్తారు.
ఇది కూడా చదవండి..
బిజెపితో పొత్తుపై మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు..
ఆ తరువాత జూన్ 27 నుంచి ఇంఛార్జి మంత్రుల ఆమోదంతో జులై 4 వరకు లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి ఆయా గ్రామ, మండల స్థాయిల్లో, వెబ్ సైట్ లో లిస్టులను ప్రదర్శిస్తారు. ఇక ఎంపికైన లబ్దిదారులకు ప్రతి నెల 15న వన్ టైమ్ బెనిఫిట్ గా ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.
లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన ఈ డబ్బులను వారికి నచ్చిన వాటికి ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ ఉపయోగానిపై ఎటువంటి ఆంక్షలు లేవు. ఆర్ధిక సాయం అందిన తరువాత నెల రోజుల్లోనే యూనిట్లను గ్రౌండింగ్ చేసుకునేలా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారి రెండు సంవత్సరాల వ్యవధిలో ప్రతి మూడు నెలలకోసారి యూనిట్లపై తనిఖీలు నిర్వహిస్తారు, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అంతేకాకుండా, ఈ తనిఖీలకు సంబంధించి లబ్ధిదారులకు అవసరమైన సలహాలు మరియు సూచనలను కూడా అందిస్తారు.
ఇది కూడా చదవండి..
Share your comments