News

తెలంగాణలో ఫిషిన్ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడి. సుమారుగా 5000 మందికి ఉపాధి.

S Vinay
S Vinay

ప్రస్తుతం చేపల పెంపకం దూసుకుపోతుంది.గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మత్స్య రంగాన్ని ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. మత్స్య ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదలని చూడవచ్చు. అయితే దీనికి ఆజ్యం పోస్తూ రూ. 1000 కోట్లతో ఫిషిన్ అనే సంస్థ ఆక్వా రంగంలో పెట్టుబడులు పెట్టనుంది. పూర్తి వివరాలు చూస్తే.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫిషిన్ అనే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాకల్చర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం తెలంగాణలో రూ.1,000 కోట్ల పెట్టుబడిని పెడుతోంది. ఈ ఫిషిన్ సంస్థ అమెరికాకి సంబందించినది. ఈ సంస్థ ముఖ్యంగా తిలాపియ జాతి చేపలను దిగుమతి చేసుకోవడంలో ప్రసిద్ధి చెందినది.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మిడ్ మానేరు రిజర్వాయర్‌ సమీపంలో ఈ ప్రాజెక్టును ఫిషిన్ సంస్థ ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్ట్ కేజ్ కల్చర్ పద్ధతిని ఉపయోగించి సంవత్సరానికి 85,000 MTల టిలాపియా చేపలను ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా సుమారుగా 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధిని మరియు మరో 2,000 మందికి పరోక్ష ఉపాధి దొరుకుతుంది. ఈ సమావేశంలో మంత్రి KTR, ఫిషిన్ సంస్థ CEO మనీష్ కుమార్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్ పాల్గొన్నారు. మంత్రి KTR మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నందుకు ఫిషింగ్‌ సంస్థకి మంత్రి కెటి రామారావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు అంతే కాకుండా స్థానిక మత్స్యకారుల సంఘం మరియు మిడ్ మానేర్ ప్రాజెక్ట్ స్థానిక కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతుంది, రాష్ట్రం రెండవ హరిత విప్లవం మరియు నీలి విప్లవాన్ని చూస్తోందని ఆయన తెలియజేశారు. ఫిషిన్ సంస్థ CEO మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి ఆక్వాకల్చర్ ప్రాజెక్ట్ అవుతుంది అని వ్యాఖ్యానించారు.

Share your comments

Subscribe Magazine

More on News

More