అదృష్టం ఇప్పుడు ఎవరికీ ఎలా వస్తుందో చెప్పలేము నేడు ఒక్క పూట తినడానికి ఇబ్బంది పడినవాడు రేపటికి కోటీశ్వరుడు అవ్వవచ్చు . అలాంటి ఘటనే ఇది దుబ్బాయికి జీవనోపాధి కోసం వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్ వాసికి బంపర్ లాటరీ తగిలింది . దీనితో నెల నెలా ఇతనికి లాటరీ సంస్థ 5. 60 లక్షల రూపాయలను నెల నెల చెల్లించనుంది. ఉపాధికోసం అని వెళ్లిన ఆదిల్‌ఖాన్ ధనవంతుడైయ్యాడు.
యూఏఈ నిర్వహించే మెగా ప్రైజ్‌మనీ లక్కీడ్రాలో ఆదిల్‌ఖాన్ తొలి విజేతగా నిలిచాడు. దీంతో ఆయన నెలనెలా రూ.5.60 లక్షల (25,000 దిర్హమ్లు) చొప్పున 25 ఏళ్లపాటు అందుకోనున్నాడు. ఆదిల్‌ఖాన్ దుబాయ్‌లోని ఓ స్థిరాస్తి సంస్థలో ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంటుగా పనిచేస్తున్నాడు. ఇటీవల యూఏఈ 'ఫాస్ట్ 5' పేరిట తీసిన లాటరీలో ఆదిల్ మొదటి విజేతగా నిలిచినట్లు గురువారం మీడియా సమావేశంలో వెల్లడించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు.
45 రోజుల్లో 4 కోట్లు సంపాదించినా చిత్తూరు టమాటా రైతు మురళి..
ఎమిరేట్స్ లాటరీ నిర్వహించే టైచెరస్ మార్కెటింగ్ హెడ్ మాట్లాడుతూ.. ''ఫాస్ట్ 5' లక్కీడ్రాను ప్రారంభించిన 8 వారాలలోపే తొలి విజేతను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. స్వల్ప వ్యవధిలోనే ఓ వ్యక్తి మల్టీ మిలియనీర్ కావడానికి మేము 'ఫాస్ట్ 5'ను తీసుకొచ్చాం. విజేతకు ప్రయోజనాలు చేకూరే విధంగా డబ్బులు ఒకేసారి కాకుండా నెల నెల ఇవ్వాలని అనుకున్నామన్నారు.
Share your comments