రోజువారీ ఆహారంలో ధాన్యాలు మరియు పప్పు దీనిసులు ఎంత అవసరమో, కూరగాయలు కూడా అంతే అవసరం, వైద్యనిపుణులు కూడా అన్నం కన్నా ఎక్కువమొత్తంలో కూరలు తినాలని సూచిస్తారు. శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, మరియు ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే ఫైబర్ ఈ కూరగాయల నుండే లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి అయితే ప్రస్తుతం మార్కెట్లో వీటికున్న ధరలు ఆకాశానికి ఎక్కి కూర్చున్నాయి. కూరగాయల ధరలు చూస్తుంటే సామాన్యుని గుండెల్లో రైళ్లు పరుగుడుతున్నాయి, రానున్న కొద్దీ రోజుల్లో ఈ ధరల మరింత ఎక్కువ పెరిగే అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం, గత ఏడాది వర్షాలు సరిగ్గ లేక కరువు పరిస్థితులు ఏర్పడ,దీనికి తోడు ఈ వేసవి కాలం ప్రారంభం నుండి అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో కూరగాయల దిగుబడి బాగా తగ్గింది. కూరగాయలతో పాటు పళ్ళ సాగులో కూడా ఇదే పరిస్థితి. మొత్తంగా ఈ ధరల పెరుగుదలతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు, కూరగాయలు మరియు పళ్ళు కొనుగోలు చెయ్యడం కష్ట తరంగ మారింది. సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో కూరగాయల ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది, ఈ పరిస్థితి ఆగష్టు మరియు సెప్టెంబర్ మాసం వరకు కొనసాగుతుంది. దేశంలో వర్షాభావ పరిస్థితులు కారణంగా 2023-24 సంవత్సరంలో 37 లక్షల టన్నులు తగ్గిందని కేంద్రం అంచనా వేసింది, ఈ ఏడాది కూడా దిగుబడి తగ్గుముఖం పట్టడంతో కాయగూరల ధరలు పెంపునకు కారణం అయ్యింది.
కూరగాయల దిగుబడులు తగ్గిపోవడానికి, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం ఒక కారణం అయితే, సాగు విస్తీర్ణం తగ్గిపోవడం మరొక్క ప్రధాన కారణం. ప్రభుత్వం వరి, మరియు వాణిజ్య, ఆహార పంటలకు ఇస్తున్నంత ప్రోత్సహకం కూరగాయల సాగుదారులకు ఇవ్వడం లేదు, దీనితో చాలా మంది రైతులు వీటిని సాగుచేసేందుకు మొగ్గుచూపడం లేదు. ఈ మధ్య కాలంలో కూరగాయల ఎగుమతుల పై కేంద్రం భారీగా సుంఖాని విదిస్తుంది. పండిన పంటలను విదేశాలకు ఎగుమతి చెయ్యడం ద్వారా రైతులకు రేటింపు లాభం చేకూరుతుంది, అయితే దేశ ప్రజల ఆహార అవసర దృష్ట్యా కేంద్రం కూరగాయల ఎగుమతులపై ఆంక్షలు విదిస్తుంది, దీనితో రైతులు కూరగాయల సాగు చేపట్టేందుకు మొగ్గు చూపడటం లేదు.
ప్రజల ఆరోగ్యం కాపాడాలంటే వారికి నాణ్యమైన ఆహారం అందేలా చెయ్యడం ప్రభుత్వం బాధ్యత. పెరుగుతున్న కూరగాయల ధరలను స్థిరీకరించి వాటిని ప్రజలకు అందుబాటు ధరల్లోకి తీసుకురావడం ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్న పెద్ద లక్ష్యం. ఈ లక్ష్యం సాధించడానికి, కూరగాయల సాగుకు అనుకూలమైన వాతావరణం కల్పించాలి, దీనికోసం కూరగాయలు సాగుచేస్తున్న రైతులకు ప్రోత్సహకాలు అందించాలి. పండిన పంటలకు మంచి ధర లభించేలా చర్యలు చేపట్టాలి. సాగుకు అవసరమైన నీటిని మరియు ఇతర అవసరాలను తీర్చేందుకు కృషి చెయ్యాలి. అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. కూరగాయలు మరియు పండ్లు సాగుకు అనుకూలమైన వాతావరణం, నేల మరియు నీటి వసతి ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి రైతులు కూరగాయల సాగు చేపట్టేవిధంగా ప్రోత్సహించాలి. ఈ చర్యలన్నీ చేపట్టడం ద్వారా కూరగాయల సాగు విస్తీర్ణం మరియు దిగుబడి పెరిగి, ధరలు నియంత్రణలో ఉండేందుకు అవకాశం ఉంటుంది.
Share your comments