పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్య ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి . వెయ్యి రూపాయలు తీసుకెళ్లిన ఒక వారానికి సరిపడా కూరగాయలు కొనే పరిస్థితి లేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల ధరలు చికన్ ,మటన్ ధరలతో పోటీపడుతున్నాయి దీనితో కొందరు ప్రజలు కూరగాయలకన్నా చికెన్ ,మటన్ కొనుక్కోవడమే ఉత్తమం అని భావిస్తున్నారు.
మే నెలలో కురిసిన చెడగొట్టు వానల కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు . ఎండాకాలం ప్రారంభంలో కిలో టమాటా రూ.6 నుంచి 8 ఉండగా, ఇప్పుడు ఏకంగా పది పన్నెండు రెట్లు పెరిగింది. కూరగాయల ధరలు చికెన్, మటన్, చేపల రేట్లతో పోటీ పడుతుండడంతో పేద, మధ్య తరగతి జనాలు కూరగాయల షాపుకు వెళ్లడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు ప్రజలు . ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలతో టమాటా తోటలు దెబ్బతిన్నాయి. ఆ. నిన్నమొన్నటి వరకు ఒక్కో ఆకు కూర కట్ట రూ.5 ఉండేది. ఇప్పుడు రూ.20 చెబుతున్నారు. నిన్నమొన్నటి వరకు రూ.200కు నాలుగు రకాల కూరగాయలు వచ్చేవని, ఇప్పుడు రూ.1000 వరకు పెట్టాల్సి వస్తోందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుబంధు కింద 70 లక్షల మంది రైతులకు రూ.7,720 కోట్లు విడుదల ..!
మరోవైపు పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు పెరుగుతున్న పప్పు ధరలు మరింత భారం పడే అవకాశం కనిపిస్తున్నది .గత నెల రోజులలుగా పప్పు ధరలు క్రమంగా పెరుగుతుండడంతో రానున్న రోజులలో పప్పు ధరలు మరింత పెరిగి సామాన్యుడి జెబ్బుకు చిల్లులు పడతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు .ఒకవైపు నూనె ధరలు తగ్గుతాయన్న ఆశభావం తో ఉన్న ప్రజలకు పెరగనున్న ధరలు మరింత భారం కానున్నాయి .దీనితో సామాన్య ప్రజలు ఏం కొనే పరిస్థితి లేదు.
Share your comments