News

విచిత్రం...చికిత్స కోసం ఆసుపత్రి గడప తొక్కిన కోతి!

S Vinay
S Vinay

బీహార్ లోని షాజుమా ప్రాంతంలోని డాక్టర్ SM అహ్మద్ క్లినిక్‌ కి వైద్య సేవల గురించి రోజు ఎంతో మంది పేషేంట్లు వస్తుంటారు, అయితే ఈ మధ్య ఒక కోతి తన చంటి బిడ్డతో సహా అతని క్లినిక్ కి చికిత్సహ పొందడానికి వచ్చింది.పూర్తి వివరాలు చదవండి.

బీహార్ రాష్ట్రం లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. షాజుమా అనే ప్రాంతంలో ఒక కోతి తీవ్రంగా గాయపడింది. అది ఏ విధంగా గాయ పడిందో కాని ఆ తల్లి కోతికి మరియు తన బిడ్డ కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే బహుశా ఈ కోతికి తెలివి ఎక్కువేమో కాబోలు ఏకంగా ఆ కోతి తన బిడ్డతో సహా మధ్యాహ్నం సమయంలో షాజామా ప్రాంతంలోని ఆస్పత్రికి చికిత్స కొరకు వెళ్ళింది. అయితే ఈ విషయం అర్థం కాక అక్కడి జనాలు మొదట గందరగోళానికి గురయ్యారు.

క్లినిక్ లోని డాక్టర్ అహ్మద్ కోతి గాయమైనట్లు గమనించాడు. కోతి సహాయం కోరుతున్నట్లు విషయం అర్థం చేసుకొని క్లినిక్ లోనికి రావాలని సూచనలు ఇచ్చాడు. ఆశ్చర్యంగా ఆ కోతి డాక్టర్ సూచనలను జాగ్రత్తగా గమనించి తదనుగుణంగా పాటించింది.కోతి క్లినిక్ లోని బెంచీపైకి ఎక్కి తన గాయాన్ని చూపించింది. దాని తలపై గాయం కాగా, తన బిడ్డ కాలికి కూడా గాయాలయ్యాయి.

వాటి బాధని అర్థం చేసుకున్న డాక్టర్, గాయాలను నిశితంగా పరిశీలించి చికిత్స ప్రారంభించాడు.వాటికి ఇంజెక్షన్ ఇచ్చి గాయాలపై మందులు రాసాడు. కోతి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కల్గించకుండా చికిత్స కి సహకరించింది.

ఈ వింత సంఘటన గురించి అప్పటికే తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంత జనాలు, ఈ ఆశ్చర్యకరమైన ఘటనని తిలకించడానికి పెద్ద సంఖ్యలో క్లినిక్ కి చేరుకున్నారు. ఆ కోతికి అంతరాయం కలగకుండా డాక్టర్ జనాలను నిలువరించారు.

ప్రస్తుతం ఈ వింత ఘటనకి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని చదవండి.

నది ఎండిపోయింది... క్రీ.పూ పురాతన నగరం బయట పడింది!

Share your comments

Subscribe Magazine

More on News

More