News

హెచ్ 1 బి వీసా నిరుద్యోగులకు అమెరికా తీపికబురు

KJ Staff
KJ Staff

ప్రపంచం మొత్తం ఐటీ కంపెనీలు కోత విధిస్తున్నాయి. ఈ లేఆఫ్ ప్రభావం అమెరికా మీద కూడా పడింది. అమెరికాలోని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, మెటా, ఆపిల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న ఎంతోమంది ఉద్యోగులు జాబ్ కోల్పాయారు, ఈ కోతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బి వీసా కలిగిన వారికి తీపికబురు అందించింది. వీరు ఉద్యోగం కోల్పోయిన 60 రోజులు దాటినా తర్వాత కూడా అమెరికాలో ఉండచ్చని తెలిపింది.

అమెరికాలో లేఆఫ్ల పర్వం కొనసాగుతున్నవేళ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు సుమారు 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని ఉద్యోగంనుండి తొలగించాయి. ఈ ఏడాది ఆఖరికి ఈ సంఖ్యా మరింత పెరిగే అవకాశం ఉంది. వీరిలో ఎంతోమంది భారతీయులు కూడా ఉన్నారు. వీరిలో హెచ్ 1 బి వీసా కలిగిన వారి పరిస్థితి మరింత కఠినతరంగా మారింది. సాధారణంగా హెచ్ 1 బి వీసాదారులు ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోపు కొత్త ఉద్యోగం తెచ్చుకోవాలి లేదంటే తమ స్వదేశానికి తిరిగివెళ్ళాలన్న నిభంధ ఉంది. అయితే ప్రస్తుతం ఎకానమీ డౌన్ లో ఉండటం వలన, కొత్త ఉద్యోగం తెచ్చుకోవడం చాల కష్టమని చెప్పచ్చు.

అయితే ఇటువంటి వారికి యూస్ సిటిజెన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తీపికబురు అందించింది. ఇకనుండి హెచ్1 బి వీసా కలిగినవారు జాబ్ కోల్పోయిన 60 రోజుల తరువాత కూడా చట్టబద్ధంగా అక్కడే ఉండచ్చు. అయితే వీరు తమ వీసా మార్చుకోవాల్సి ఉంటుంది, ఒకటి నాన్ ఇమిగ్రంట్ వీసా, లేదంటే జీవిత భాగస్వామిపై డిపెండెంట్ వీసా పొందవచ్చు. దీని ద్వారా వీరి వీసా స్టేటస్ ఎల్1 లేదా హెచ్4 వీసా క్యాటగిరీలోకి మారుతుంది, ఈ వీసాలు ఉన్నవారికి వర్క్ ఆధరైజషన్ లభిస్తుంది. 60 రోజుల గ్రేస్ పీరియడ్ లోనే వీసా స్టేటస్ మార్చుకోవాలని యూస్సిఐఎస్ సూచించింది.

Share your comments

Subscribe Magazine

More on News

More