ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ నెల నుండి విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తానని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా విశాఖపట్నంలోనే నినసిస్తానని ప్రకటించారు. ఇక నుంచి ఆ నగరం కొత్త పరిపాలనా రాజధానిగా మారుతుందని జగన్ ప్రకటించారు.
పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం ఇటీవల చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగానే ఇది జరుగుతుందన్నారు. విశాఖపట్నం రాష్ట్రం నలుమూలల నుండి చాలా మందికి ఆమోదయోగ్యమైన నగరమని, అందుకే కొత్త రాజధానిగా ప్రకటించామని జగన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇవాళ అనగా బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు.
శ్రీకాకుళంలో నేటి నుంచి నాలుగు మంచి కార్యక్రమాలు జరుపుకున్నామని జగన్ అన్నారు. మూలాపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, నౌపడ సమీపంలో పోర్టు ఎవాక్యూ కాలనీకి శంకుస్థాపన చేశామన్నారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం రూపురేఖలను మారుస్తాయి.
ఇది కూడా చదవండి..
గుడ్‌న్యూస్ .. త్వరలో తెలంగాణాలో కొత్త పెన్షన్లు!
శ్రీకాకుళానికి పోర్టు వస్తే.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయని.. లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నట్టుగా చెప్పారు. గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గంగపుత్రులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లకుండా కృషి చేస్తున్నామని చెప్పారు.
గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను విస్మరించారని, ఆయన నాయకత్వంలో మూలాపేట అభివృద్ధికి స్తంభంగా నిలుస్తుందని సీఎం అన్నారు. మూలపేట, విష్ణుచక్రం మరో ముంబయి, మద్రాస్‌గా మారబోతున్నాయని, కేవలం 24 నెలల్లోనే ఓడరేవు పూర్తవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. పోర్టు ద్వారా 35 వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..
Share your comments